Share News

Stock Markets: రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ల దూకుడు.. ఏకంగా 1,231 పాయింట్లు

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:24 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం (జూన్ 6న) రెండో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ గెయినర్లుగా ఉన్న స్టాక్స్ వివరాలను ఇప్పుడు చుద్దాం.

 Stock Markets: రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ల దూకుడు.. ఏకంగా 1,231 పాయింట్లు
stock markets on the open green june 6th 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం (జూన్ 6న) రెండో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో ఉదయం 10.12 గంటల నాటికి సెన్సెక్స్ 512 పాయింట్లు లాభపడి 74,892 పరిధిలో ట్రేడవగా, నిఫ్టీ 158 పాయింట్లు వృద్ధి చెంది 22774 స్థాయి వద్ద ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 1231 పాయింట్లు లాభపడింది. బుధవారం భారీ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ సానుకూలంగా కనిపిస్తోంది.


ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ(BSE)లో ప్రస్తుతం ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నెస్లే, హెచ్‌యుఎల్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ టాప్ గెయినర్స్‌గా ఉండగా, హెచ్‌యూఎల్, బ్రిటానియా టోర్ లూజర్‌గా ఉన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ కూడా దాదాపు 2.5 శాతం జంప్ చేయగా, మిడ్‌క్యాప్ 1.50 శాతానికి పైగా ఎగబాకింది.

ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.98 శాతం లాభాలతో ముందుండగా, పీఎస్‌యూ బ్యాంక్ (2.62 శాతం), మీడియా (2.02 శాతం) లాభపడ్డాయి. ఇది కాకుండా ONGC, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, BPCLలో లాభాలు నమోదయ్యాయి. హెచ్‌యూఎల్, బ్రిటానియా షేర్లు నష్టాలను చవిచూశాయి.


మరోవైపు అంతర్జాతీయ సూచీలైన డౌ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి. నిక్కీ 450 పాయింట్లు బలపడింది. అదే సమయంలో బుధవారం అమెరికన్(american) మార్కెట్లలో బలమైన పెరుగుదల కనిపించింది. టెక్ స్టాక్స్‌లో బలమైన పెరుగుదల కారణంగా నాస్‌డాక్, S&P 500 జీవిత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నాస్‌డాక్ 330 పాయింట్లు ఎగబాకగా, డౌ జోన్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 2300 తగ్గుదల


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

For Latest News and Business News click here

Updated Date - Jun 06 , 2024 | 10:30 AM