Stock Markets: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 స్టాక్స్ ఏవంటే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 09:57 AM
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో మొదలై, భారీ లాభాల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 340 పాయింట్లు వృద్ధి చెందగా, మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 270కిపైగా పాయింట్లు లాభపడింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) బుధవారం (డిసెంబర్ 4) భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.45 గంటల నాటికి సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 81,193 పరిధిలో ట్రేడ్ కాగా, నిఫ్టీ బ్యాంక్ 98 పాయింట్ల లాభంతో 24,542 దగ్గర ట్రేడవుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్లు వృద్ధి చెంది 52,958 స్థాయిలో ట్రేడవగా, మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 272 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. నిన్నటి ముగింపుతో పోలిస్తే మార్కెట్ స్వల్ప పెరుగుదలతో మొదలై, క్రమంగా పుంజుకున్నాయి.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో HDFC లైఫ్, TSH, SBI లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, HDFC బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5లో ఉండగా, భారతి ఎయిర్‌టెల్, సిప్లా, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్‌ప్రైస్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్విగ్గీ షేర్లు 6.6 శాతం జంప్ చేసి ఒక్కో షేరుకు రూ. 534.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం తన సెప్టెంబర్ త్రైమాసికాన్ని మంగళవారం, పోస్ట్ మార్కెట్ అవర్స్‌లో విడుదల చేసిన తర్వాత మదుపర్లలో కొనుగోలు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,15,727.73 కోట్లుగా ఉంది.
కారణమిదేనా..
ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ ఈ వారం మార్కెట్ నిరంతరం లాభాలను చూపించడం విశేషం. చాలా రంగాల సూచీలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోంది. ఎఫ్‌ఐఐలు నిన్న రూ. 5700 కోట్లకు పైగా నగదు, ఇండెక్స్ ఫ్యూచర్‌లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 250 కోట్ల విక్రయాలు చేశాయి.
మార్కెట్ క్యాపిటలైజేషన్
ఈరోజు ప్రారంభమయ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంతో పాటు నవంబర్‌కు సంబంధించిన సేవలు, మిశ్రమ PMI డేటా కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించింది. ఈక్విటీ మార్కెట్లలో ఇటీవల దిద్దుబాటు ఉన్నప్పటికీ భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తి (GDP)కి మార్కెట్ క్యాపిటలైజేషన్ నిష్పత్తి ఎలివేట్‌గా ఉంది. ఇది మంగళవారం నాటికి 147.5 శాతంగా ఉంది. ఇది 10 సంవత్సరాల సగటు 94 శాతం కంటే 56 శాతం ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుత నిష్పత్తి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి ఆల్ టైమ్ హై రేషియో 154 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. డిసెంబర్ 2007, సెప్టెంబర్ తర్వాత ఇది అత్యధికం.
ఇవి కూడా చదవండి:
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News