Sukanya Samriddhi Yojana: నెలకు రూ. 5 వేల పెట్టుబడి..మీ పాప పెరిగే సరికి గ్యారెంటీ ఇన్ కం..
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:39 PM
మీరు మీ పాప పెళ్లి(girl) కోసం మంచి గ్యారంటీ ఉన్న పెట్టుబడి స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ప్రభుత్వం నిర్వహించే సుకన్య సమృద్ధి యోజనలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మీ పాప పెళ్లి(girl) కోసం మంచి గ్యారంటీ ఉన్న పెట్టుబడి(savings) స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ పథకంలో మీకు గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. దీనిలో మోసం, పెట్టిన మొత్తం తక్కువగా రావడం వంటివి ఏం ఉండదు. అదే భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సుకన్య సమృద్ధి యోజన స్కీం(Sukanya Samriddhi Yojana). ఇందులో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అదే సమయంలో ఈ స్కీంలో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిదారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టకపోతే సుకన్య ఖాతాను స్తంభింపజేస్తారు.
దీర్ఘకాలంలో
ఈ దీర్ఘకాలిక(long time) పథకంలో ప్రస్తుతం 8.2 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా, మీరు ఈ పథకం ద్వారా దీర్ఘకాలంలో మీ కుమార్తె కోసం పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. మీరు సుకన్య యోజనలో ప్రతి నెలా రూ. 5,000 పెట్టుబడి పెడితే, ఒక సంవత్సరంలో మొత్తం రూ. 60,000 అవుతుంది. ఆ క్రమంలో 15 సంవత్సరాలలో రూ. 9,00,000 పెట్టుబడి పెడతారు. 15 ఏళ్ల తర్వాత ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పథకం మెచ్యూర్ అయినప్పుడు అంటే 21 సంవత్సరాల తర్వాత, మీరు 8.2 శాతం వడ్డీ రేటుతో రూ. 18,71,031 కలిపి మొత్తం రూ. 27,71,031 పొందుతారు.
పాక్షిక ఉపసంహరణ
మీ కుమార్తె(girl) 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతా నుంచి విత్‌డ్రా(with draw) చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు గత ఆర్థిక సంవత్సరం మొత్తం బ్యాలెన్స్‌లో 50% వరకు ఉపసంహరించుకోవచ్చు. డబ్బును(money) ఏకమొత్తంలో లేదా వాయిదాలలో స్వీకరించవచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే డబ్బు అందుతుంది.
గరిష్టంగా ఐదేళ్ల వరకు వాయిదాల పద్ధతిలో డబ్బు తీసుకోవచ్చు. మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు ప్రభుత్వం నిర్వహించే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు రిస్క్‌తో పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి:
Alert: వీటికి నేడే డెడ్ లైన్.. అప్‌డేట్ చేసుకున్నారా..
Gold and Silver Prices: బంగారం కొనాలని చుస్తున్నారా..ఈ ధరలు తెలుసుకోండి మరి
For Latest News and Business News click here