Share News

Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌లో హీరోగా హార్దిక్ పాండ్యా..

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:22 AM

ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.

Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌లో హీరోగా హార్దిక్ పాండ్యా..
Hardik Pandya T20 World Cup 2024 Natasa Stankovic

ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయానికి తోడ్పాటునందించాడు. దీంతో దేశంలోని క్రీఢాభిమానులందరూ ఈ క్రికెటర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక మింది విషెస్ తెలుపుతున్నారు.

కానీ ఇదే సమయంలో పాండ్యా అభిమానులు ఆయన భార్య నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) సోషల్ మీడియా ఖాతాలను తెగ వెతికేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీరిద్దరు డివోస్ తీసుకుంటున్నారనే పుకార్లు వచ్చాయి. కానీ ఈ అంశంపై ఈ జంట నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఇంత పెద్ద విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా, లేదా టీమిండియాకు నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.


నటాషా రియాక్ట్ అయ్యిందా

అయితే వీరిద్దరి మధ్య పుకార్ల సమయంలో కూడా నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. దాదాపు ప్రతిరోజూ తన కొత్త ఫోటోలు, వీడియోలను పంచుకుంది. కానీ T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయంలో నటాషా హార్దిక్ పాండ్యా కోసం ఎటువంటి పోస్ట్ లేదా కామెంట్ చేయలేదు. అంతేకాదు T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ పాండ్యా లేదా టీమ్ ఇండియా కోసం ఎటువంటి పోస్టులను పంచుకోలేదు. దీనికి ముందు అనేక పోస్టులు చేసిన నటాషా వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన పాండ్యా గురించి రియాక్ట్ కాకపోవడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు.


హార్దిక్ భావోద్వేగం

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో(final) హార్దిక్ పాండ్యా(Hardik Pandya) హీరోగా మారిపోయాడు. చివరి ఓవర్లో హార్దిక్‌ బౌలింగ్‌ చేసేందుకు పిచ్‌ వద్దకు రాగా అతని ముందు బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఉన్నాడు. అయితే హార్దిక్ వేసిన బంతికి షాట్ కొట్టి డేవిడ్ బంతిని ఫ్లై చేయగా, సూర్య కుమార్ యాదవ్ మధ్యలోకి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఇక దీని తర్వాత మ్యాచ్ మొత్తం తలకిందులు కావడంతో భారత్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.


ఇది కూడా చదవండి:

T20 World Cup 2024: టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ..ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక విషెస్


Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ


T20 World Cup Winner India : కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 10:44 AM