Elon Musk: ఈనెలలో ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ.. అందుకోసమేనా
ABN , Publish Date - Apr 10 , 2024 | 08:41 PM
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(Elon Musk) ఈ నెలలో (ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య) భారత్ సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)ని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మస్క్ దేశంలో పెట్టుబడి ప్రణాళికలు, కొత్త టెస్లా ప్లాంట్ నిర్మాణం గురించి కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(Elon Musk) ఈ నెలలో (ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య) భారత్ సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)ని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మస్క్ దేశంలో పెట్టుబడి ప్రణాళికలు, కొత్త టెస్లా ప్లాంట్ నిర్మాణం గురించి కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సందర్శన అత్యంత గోప్యంగా ఉందని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అంశంపై ఏమి చెప్పలేదు.
ఇండియాలో టెస్లా(tesla) ప్రవేశంపై ఎలాన్ మస్క్ కూడా సూచనప్రాయంగా చెప్పారు. భారత ప్రభుత్వం కొత్త EV పాలసీని ప్రకటించినప్పటి నుంచి భారతదేశంలో టెస్లా ప్రవేశంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. కొత్త EV విధానంలో దేశంలో ఉత్పత్తి చేసి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కొత్త EV పాలసీలో $500 మిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే కంపెనీలకు 5 సంవత్సరాలకు 15 శాతం కస్టమ్స్ డ్యూటీ ప్రయోజనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి వారు 3 సంవత్సరాలలో భారతదేశంలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. అలాగే భారతదేశంలో తయారు చేయబడిన 25 శాతం భాగాలను 3 సంవత్సరాలలోపు 50 శాతం భాగాలను 5 సంవత్సరాలలోపు భారతదేశంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
దీనికి ముందు కూడా భారత్‌లో తయారీ ప్లాంట్ల స్థలం చూసేందుకు టెస్లా అధికారులు ఈ నెలలో ఇండియా సందర్శించవచ్చని నివేదికలు వచ్చాయి. ఆ క్రమంలో టెస్లా తయారీ ప్లాంట్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది. టెస్లా బృందం దాని ప్రతిపాదిత ప్లాంట్‌కు తగిన స్థలాన్ని కనుగొనడానికి అనేక రాష్ట్రాలను సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు టెస్లాకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు భూమితో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఇచ్చాయి. దీంతో పాటు ఈవీ తయారీ ప్లాంట్‌ను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టెస్లా బృందం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాలను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..
EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం