Share News

Stake to Employees: ఉద్యోగులకు 33 శాతం వాటాను ప్రకటించిన కంపెనీ..సిబ్బంది సంతోషం

ABN , Publish Date - Jan 03 , 2024 | 05:23 PM

ఒక సంస్థ ఎదుగుదలకు ఉద్యోగులు(employees) ఎంతో కీలకం. అయితే అలాంటి వారికి పలు కంపెనీలు పండుగలు సహా ఆయా సందర్భాలను బట్టి ప్రత్యేక బహుమతులను అందిస్తుంటాయి. కానీ ఓ కంపెనీ మాత్రం ఏకంగా తన సంస్థలో 33 శాతం వాటాను ప్రకటించింది. ఈ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Stake to Employees: ఉద్యోగులకు 33 శాతం వాటాను ప్రకటించిన కంపెనీ..సిబ్బంది సంతోషం

ఓ కంపెనీ తన ఉద్యోగులకు(employees) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా కంపెనీ వాటాలో తన ఉద్యోగులకు 33 శాతం వాటా అందిస్తున్నట్లు తెలిపింది. చెన్నైలో ఉండే Ideas2IT అనే హై ఎండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ ఉద్యోగులకు ఓనర్ షిప్ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు అనౌన్స్ చేసింది. అయితే తమ సంస్థలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఉద్యోగులు, యాజమాన్యం మధ్య మంచి సంబంధాలను కొనసాగించడమే లక్ష్యంగా ఈ మేరకు ప్రకటించినట్లు సంస్థ తెలిపింది. ఈ క్రమంలో వారి సంస్థలో మొదటి నుంచి పనిచేస్తున్న ఎంపిక చేసిన 40 మంది ఉద్యోగులకు 5 శాతం, మిగతా వారికి మిగిలిన మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.


ఈ నేపథ్యంలో వారి ఉద్యోగులకు ఆర్‌ఎస్‌యులు(RSU) నియంత్రిత స్టాక్ యూనిట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్ తెలిపారు. వీటిని ఉద్యోగులు ప్రోత్సాహకంగా పొందుతున్నారు కాబట్టి వారికి డబ్బు రూపంలో చెల్లించాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఈక్వీటీ షేర్ల(shares) రూపంలో అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 750 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు వ్యవస్థాపకులు వెల్లడించారు. దీని కార్యకలాపాలు భారతదేశం, USA, మెక్సికో అంతటా విస్తరించి ఉన్నాయని అన్నారు. ఇక ఈ ఆఫర్‌కు ఎంపికైన ఉద్యోగులు వాటాదారులుగా మారతారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సంస్థ విజయంలో కూడా ఉద్యోగులు నిజమైన భాగస్వామ్యులుగా వ్యవహరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 05:35 PM