Today Gold Price: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధర..
ABN , Publish Date - Oct 15 , 2024 | 08:24 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం ఉదయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,140ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,610గా ఉంది.
హైదరాబాద్: దసరా పండగ సందర్భంగా బంగారం, వెండి ధరలు పెరిగినట్లే పెరిగి మళ్లీ స్వల్పంగా తగ్గాయి. పండగ వేళ ఒక్కసారిగా రేట్లు పెరగడంతో మహిళలు పసిడి కొన్నాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడంతో దేశంలోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం ఉదయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,140ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,610గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో రూ.1,02,900గా ఉంది. అలాగే పూణే, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలలో రూ.96,900గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే నేటి ఉదయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.10లు తగ్గింది. కిలో వెండి రూ.100మేర తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి రికార్డు ధరలు దిగివస్తున్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ రేటు 2,648 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సోమవారం రోజున దాదాపు 10 డాలర్లు మేర ఔన్సు బంగారం ధర పడిపోయింది. ఇవాళ ఉదయానికి మళ్లీ అదే రేటు వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 31.19 డాలర్లుగా ఉంది.