Union Budget 2024: మళ్లీ బడ్జెట్ వచ్చేస్తోంది.. వచ్చే నెలలోనే సర్వే సహా..!
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:56 PM
దేశంలో నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను(Union Budget 2024) వచ్చే నెల 22వ సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
దేశంలో నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను(Union Budget 2024) వచ్చే నెల 22న సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి ఏడాది బడ్జెట్ జూలై 22న రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే 18వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని కొత్త పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(kiran rijiju) తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్‌ను జూలై మూడో వారంలో సమర్పించవచ్చని తెలుస్తోంది.
నిర్మలా సీతారామన్ రికార్డు!
అయితే మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. ఈ క్రమంలో దేశంలో వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలువనున్నారు. అంతకుముందు వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా అధిగమించనున్నారు.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు(kiran rijiju) బుధవారం తెలిపారు. మొదటి మూడు రోజుల్లో, ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్‌సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో కొత్త ప్రభుత్వం రాబోయే ఐదేళ్ల లక్ష్యాలను వివరిస్తారు. ఈ సెషన్ జూలై 3 వరకు కొనసాగుతుంది.
పార్లమెంటు ఉభయ సభల తదుపరి సమావేశాన్ని జూలై మూడో వారంలో పిలవవచ్చు. దీనిలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ గురించి రిజిజు మాట్లాడుతూ, దీని 264వ సెషన్ జూన్ 27న ప్రారంభమై జూలై 3 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి:
Kuwait Fire: కువైట్ నుంచి 45 మంది మృతదేహాలతో కేరళ చేరుకున్న IAF విమానం..రూ.7 లక్షల సాయం
Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!
For Latest News and Business News click here