Share News

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:02 PM

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..
hybrid cars

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. దీంతో అనేక మంది ఈ మోడల్లో వచ్చిన కార్లు, జీపులు సహా ఇతర వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.


మార్కెట్ డిమాండ్

యోగి ప్రభుత్వం జులై 5న 'స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లపై(hybrid cars)' 100% రోడ్డు పన్నును రద్దు(road tax ban) చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో కంపెనీలు, కొనుగోలుదారులు లాభపడతారు. ఈ నేపథ్యంలో ఈ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత మూడు నెలల్లో లక్నోలో 850 హైబ్రిడ్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీలో హైబ్రిడ్ వాహనాలపై రోడ్డు పన్ను వసూలు చేయకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే రోడ్డు పన్ను మినహాయింపు ఉంది.


ట్యాక్స్ ఫ్రీ

ఈ క్రమంలో మారుతీ, హోండా సిటీ, మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ సహా హైబ్రిడ్ కార్ల ఇతర వాహన కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. ఈ కార్లను కొనుగోలు చేస్తే కనీసం రూ.1.5 నుంచి 2 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో యూపీలో హైబ్రిడ్‌ కార్ల విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా బెంగళూరు, తెలంగాణ(telangana)లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఢిల్లీ(delhi) సహా పలు ప్రాంతాల్లో కూడా ఈ వాహనాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించాలని అక్కడి మార్కెట్ వర్గాలు, స్థానికులు కోరుతున్నారు.

భారతదేశంలో అతిపెద్ద కార్ మార్కెట్లలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఒకటి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌లో 10% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఉత్తర ప్రదేశ్‌లో 2,36,097 యూనిట్ల రిటైల్ అమ్మకాలు జరిగాయి. ఇది జనవరి-జూన్ 2023లో 2,08,092 యూనిట్ల కంటే 13.46% ఎక్కువ.


ఇది కూడా చదవండి:

Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..


Anant Ambani-Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి కోసం ముంబై చేరుకున్న.. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ సహా..

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 12 , 2024 | 12:43 PM