Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:35 PM
ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ సహా పలు చోట్ల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో మీరు ఆ వస్తువుల వారంటీ(Warranty) గురించి అడిగిన సందర్భాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల ఈ ఉత్పత్తులకు గ్యారంటీ(Guarantee) ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వీటి గురించి తెలియకపోతే ఎందుకు నష్టపోతాం, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ సహా పలు చోట్ల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఆ సమయంలో మీరు ఆ వస్తువుల వారంటీ(Warranty) గురించి అడిగిన సందర్భాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల ఈ ఉత్పత్తులకు గ్యారంటీ(Guarantee) ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వారంటీ, గ్యారంటీ అనే రెండు పదాలు వినడానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి మధ్య వ్యత్యాసం మాత్రం చాలా మందికి తెలియదు.
ఈ రెండు పదాల మధ్య తేడా తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వీటి మధ్య తేడా తెలియకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే వీటి గురించి తెలియకపోతే ఎందుకు నష్టపోతాం, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే వస్తువులను కొనుగోలు చేసే విషయంలో ఇవి చాలా ప్రధానమని చెప్పవచ్చు.
వారంటీ
వారంటీ(warranty) అనేది ఒక రకమైన వ్రాతపూర్వక పత్రం. మీరు ఏదైనా వస్తువును(product) కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా సేవను పొందుతున్నప్పుడు, తయారీదారు ద్వారా మీకు వారంటీ కార్డ్ ఇస్తారు. దానిలో మీరు ఉత్పత్తిలో ఏదైనా రకమైన లోపం లేదా నష్టం లేదా సేవలో ఏదైనా సమస్య ఉంటే మీకు రిపేర్ చేసి ఇస్తారు. దీని కోసం మీ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయరు. తయారీదారు తన సొంత ఖర్చుతో వస్తువులను మరమ్మతు చేసి ఇస్తారు.
గ్యారంటీ
ఉత్పత్తి నాణ్యత తక్కువగా ఉండటం లేదా చెప్పిన ప్రకారం అవసరాలను తీర్చడంలో ఆయా వస్తువు విఫలమైతే వినియోగదారుడు ఆ ఉత్పత్తిని మరమ్మత్తు చేయించుకోవచ్చు లేదా తిరిగి కొత్తది పొందవచ్చు. అందుకోసం తయారీదారు లేదా కంపెనీ వినియోగదారులకు ఇచ్చే హామీ పత్రాన్ని గ్యారంటీ(Guarantee) అంటారు. దీని కోసం కూడా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
రెండింటి మధ్య ప్రధాన తేడాలు
వారంటీలో ఇచ్చిన సమయం తర్వాత రిపేర్ కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది
వారంటీలో మీ ఉత్పత్తిని మరమ్మతు మాత్రమే చేసుకోవచ్చు, కొత్తది పొందలేరు
వారంటీలో ఇచ్చిన సమయం తర్వాత గడువు పెంచుకునే అవకాశం ఉంటుంది, కానీ గ్యారంటీలో ఉండదు
గ్యారంటీ వ్రాతపూర్వకంగా లేదా మౌఖికంగా ఉండవచ్చు
గ్యారంటీ సమయంలో వస్తువులలో ఏదైనా లోపం ఉంటే మీరు పూర్తి డబ్బును లేదా వస్తువును తిరిగి పొందవచ్చు, కానీ ఇది వారంటీ విషయంలో ఉండదు
గ్యారంటీ విషయంలో మీకు ఎల్లప్పుడూ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. వస్తువుకు సంబంధించిన బిల్లు ఉంటే సరిపోతుంది
ఇది కూడా చదవండి:
ఎస్‌బీఐ రూ.10 వేల కోట్ల సమీకరణ
For Latest News and Business News click here