Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...
ABN , Publish Date - Nov 13 , 2024 | 07:10 PM
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
దేశంలో ఈసారి వచ్చిన పెళ్లిళ్ల సీజన్‌లో కూరగాయల ధరలు (Vegetable prices) మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో పెళ్లిళ్లు చేసుకునే వారు వంటల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఆయిల్ ధరలు కూడా చాలా పెరిగాయి. ఎందుకంటే ఇటివల వచ్చిన నివేదికలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (inflation) ఆగస్టులో 5.49 శాతం నుంచి అక్టోబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 6.21 శాతానికి పెరిగింది. పెరుగుతున్న కూరగాయల ధరల నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 9.2 శాతం నుంచి 10.87 శాతానికి చేరుకుంది.
కారణమిదేనా..
అయితే దీనికి ప్రధాన కారణం కూరగాయల ధరలు 42.18 శాతం పెరగడమేనని నిపుణులు అంటున్నారు. పచ్చికూరగాయల ధరలు గతం కంటే స్వల్పంగా తగ్గాయి. కానీ వెల్లుల్లి, బంగాళదుంప వంటి తదితర ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఇవి మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో డ్రైఫ్రూట్స్ ధరలు కూడా పెరగడం విశేషం. ఇక బంగారం ధరల విషయానికి వస్తే పెళ్లిళ్ల సీజన్ ఉన్న నేపథ్యంలో అనేక మంది ముందే బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో వీటి ధరలు గతంలో కంటే తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
బంగారం, వెండి ఇలా..
దీపావళి నాటికి కిలో వెండి ధర రూ. 99 వేలకు చేరుకోగా, 10 గ్రాముల బంగారం ధర రూ. 82-83 వేలకు చేరుకుంది. ప్రస్తుతం వెండి ధర కిలో రూ. 90-91 వేలకు తగ్గగా, బంగారం ధర కూడా 10 గ్రాములు రూ.78 వేల స్థాయికి చేరుకుంది. అందువల్ల తగ్గిన రేట్ల ప్రయోజనం ముందుగా కొనుగోలు చేసిన వారికి లభించలేదని చెప్పవచ్చు. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు మాత్రం పెరిగే అవకాశం లేదని పలువురు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం పెరుగుతాయని అంటున్నారు.
గతంలో ఇలా..
ఏది ఏమైనా నిత్యావసరాల ధరలు ఇంకొన్ని రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఉత్పత్తులు ముందుగానే కొనుగోలు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. గతంలో దసరా పండుగకు ముందే వంట నూనెల ధరలు పెరుగుతాయని తెలిసి అనేక మంది ముందే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. ఇలా చేయడం వల్ల కొంత మందికి ప్రయోజనం చేకూరగా, మరికొంత మందికి మాత్రం నష్టం జరిగింది. వంటనూనెను అనేక మంది ముందే కొనుగోలు చేయడంతో పండుగ సమయాల్లో పలువురు ఎక్కువ రేటుతో తీసుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..
Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More International News and Latest Telugu News