Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించకుంటే ఏమవుతుంది?
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:26 PM
ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అనేక మంది ఉద్యోగులు(employees) క్రెడిట్ కార్డులను(credit cards) ఉపయోగిస్తున్నారు. ఈ కార్డులను ప్రతి నెల అనేక మంది ఖర్చుల చెల్లింపుల కోసం వినియోగిస్తారు. ఇక మంత్ ఎండ్ వచ్చే సరికి వాటి బిల్లుల(bills) చెల్లింపు తేదీ అలర్ట్‌లు వచ్చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు గడువు తేదీలోపు బిల్లులు(bills) చెల్లింపు చేయకుంటే ఏమవుతుంది. అలా చేయడం సరైనదేనా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అనేక మంది ఉద్యోగులు(employees) క్రెడిట్ కార్డులను(credit cards) ఉపయోగిస్తున్నారు. ఈ కార్డులను ప్రతి నెల అనేక మంది ఖర్చుల చెల్లింపుల కోసం వినియోగిస్తారు. ఇక మంత్ ఎండ్ వచ్చే సరికి వాటి బిల్లుల(bills) చెల్లింపు తేదీ అలర్ట్‌లు వచ్చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనేక మంది వీటిని గడువులోగా చెల్లింపులు చేస్తారు. కానీ కొంత మంది డబ్బులు లేకపోవడం సహా అనేక కారణాల వల్ల బిల్లు చెల్లింపులను గడువు తేదీలోగా పే చేయలేకపోతారు. ఈ నేపథ్యంలో అసలు గడువు తేదీలోపు బిల్లులు(bills) చెల్లింపు చేయకుంటే ఏమవుతుంది. అలా చేయడం సరైనదేనా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా మీరు మనీ బ్యాలెన్స్ కలిగి ఉంటే వెంటనే క్రెడిట్ కార్డ్ చెల్లింపులను చేయండి
ఇక బిల్స్ ఆలస్యంగా చెల్లింపు చేస్తే అనేక బ్యాంకులు, క్రెడిట్ కంపెనీలు పెండింగ్ సమయం ఆధారంగా ఆలస్య చెల్లింపు ఛార్జీలను విధిస్తాయి
కనీస బకాయి మొత్తాన్ని చెల్లించనట్లయితే రూ. 1000 వరకు ఆలస్య చెల్లింపు రుసుము వసూలు చేస్తారు
వినియోగదారులు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంలో విఫలమైతే, దానికి అదనపు వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఇది మీకు అదనపు భారమని చెప్పవచ్చు
మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి చెల్లించలేకపోతే, మీరు దానిని EMIగా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతి నెలా చిన్న వాయిదాలలో చెల్లించుకోవచ్చు
మీకు వచ్చిన బిల్లును వాయిదాలలో చెల్లించాలని ఎంచుకుంటే, మీరు అదనపు వడ్డీని పే చేయాల్సి వస్తుంది
రుణ EMI కాలానికి ముందు చెల్లింపు చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు
క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు 40 శాతం వరకు ఫైనాన్స్ ఛార్జీలను వసూలు చేస్తాయి
ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వీలైతే కనీస బకాయి మొత్తాన్ని చెల్లించండి
మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ. 50,000 ఉంటే మీరు రూ. 40,000 విలువైన ఏదైనా వస్తువును కొనుగోలు చేసి EMI ద్వారా చెల్లించాలని ఎంచుకుంటే, మీ క్రెడిట్ పరిమితి రూ. 10,000కి తగ్గించబడుతుంది. కానీ మీరు వాయిదాలు చెల్లించేటప్పుడు, మీ క్రెడిట్ పరిమితి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి:
Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి
Read Latest Business News and Telugu News