Share News

Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ప్రమాదం.. ఆరుగురిలో ఐదుగురు వైద్యులు మృతి

ABN , Publish Date - Nov 27 , 2024 | 09:20 AM

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఐదుగురు డాక్టర్లు ఉండటం విశేషం. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ప్రమాదం.. ఆరుగురిలో ఐదుగురు వైద్యులు మృతి
5 doctors killed car accident

ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) కన్నౌజ్ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం (accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో సైఫాయి మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు మరణించారు. వైద్యులందరూ లక్నో నుంచి తిరిగి వస్తున్నారని, బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేగంగా వచ్చిన స్కార్పియో.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మరణించారు.


పెళ్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులంతా సైఫాయి మెడికల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న వారేనని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యూనివర్సిటీ సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్‌కు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు వైద్యులలో ఆగ్రాకు చెందిన 29 ఏళ్ల డాక్టర్ అనిరుధ్ వర్మ, న్యూ క్యాంపస్ రిమ్స్ సైఫాయికి చెందిన డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, మొరాదాబాద్‌కు చెందిన డాక్టర్ జైవీర్ సింగ్, మోతీపూర్ కన్నౌజ్‌కు చెందిన డాక్టర్ అరుణ్ కుమార్‌, బరేలీకి చెందిన డాక్టర్ నార్దేవ్ ఉన్నారు.


సీఎం స్పందన

డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. స్కార్పియో నంబర్ 80 HB 0703 కాగా, కారును ఢీకొన్న ట్రక్కు సంఖ్య RJ 09 CD 3455. అందరూ లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. డాక్టర్ల కారు ఎక్స్‌ప్రెస్‌వేపై మిడిల్ డివైడర్‌ను దాటి అవతలి వైపుకు చేరుకోగా, కారు వెనుక నుంచి అతివేగంతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు. దీంతో పాటు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగిందా లేదా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న సమయంలో జరిగిందా అనే పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధిత మృతుల కుటుంబాలకు సమాచారం అందించడంతో వారి కుటుంబాల్లో విషాధం నెలకొంది.


ఇవి కూడా చదవండి:

Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..


Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 27 , 2024 | 09:31 AM