Share News

95 Children: 95 మంది చిన్నారుల అక్రమ రవాణా..రక్షించిన అధికారులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:55 AM

ఉత్తర్‌ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వారిని ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం తెలియాల్సి ఉంది.

95 Children: 95 మంది చిన్నారుల అక్రమ రవాణా..రక్షించిన అధికారులు
95 children illegally being taken from Bihar

ఉత్తర్‌ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. బీహార్‌లోని వివిధ జిల్లాల నుంచి 99 మంది పిల్లలను(children) బస్సు(bus)లో సహరాన్‌పూర్‌కు తీసుకెళ్తున్న ఐదుగురు మత గురువులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం శుక్రవారం పట్టుకుంది.


పిల్లల(children) వయస్సు తొమ్మిది నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు అన్నారు. అందరినీ లక్నోలోని ముంతాజ్ ఆశ్రమంలో ఉంచారు. పోలీసులు మతపెద్దలను విచారించి మొత్తం రాకెట్‌కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. కమిషన్ సభ్యుడు డా. మిషన్ ముక్తి ఫౌండేషన్ న్యూఢిల్లీ డైరెక్టర్ వీరేంద్ర సింగ్ సమాచారం మేరకు బీహార్‌లోని అరారియా, పూర్నియా నుంచి తీసుకువస్తున్న చిన్నారులను సురక్షితంగా రక్షించినట్లు శుచితా చతుర్వేది తెలిపారు.


బీహార్‌(bihar)లోని అరారియా, పూర్నియా ప్రాంతాల నుంచి సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌కు చాలా మంది పిల్లలను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ సుచితా చతుర్వేదికి సమాచారం అందింది. దీంతో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి సమాచారం అందించారు. ఆ తరువాత అయోధ్య పోలీసుల యూనిట్ నగరంలోని బడి దేవ్‌కలి వద్ద ఉన్న హైవేపై బస్సును ఆపగా, అందులో 95 మంది చిన్నారులు కనిపించారు. వారితోపాటు ఐదుగురు మౌల్వీలు ఉన్నారు. ఆ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


అయితే పిల్లలను ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియదు. మౌల్వీ ఇచ్చిన సమాచారం కూడా అబద్ధమని అధికారులు(officers) చెబుతున్నారు. మౌల్వీల వద్ద పిల్లల తల్లిదండ్రుల పేర్లు, సమ్మతి లేఖలు కూడా లేవని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన సర్వేష్ అవస్థి తెలిపారు. చాలా మంది పిల్లలు అనాథలని అన్నారు. గతంలో బీహార్ నుంచి పిల్లలను వివిధ రాష్ట్రాల మదర్సాలకు పంపేవారు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను తరలిస్తున్నారనే విషయం కూడా తేలాల్సి ఉంది.


ఇది కూడా చదవండి:

BJP: కమలం ఆశల రేకులు హ్యాట్రిక్‌ కొట్టి రికార్డు సాధించడంపై బీజేపీ గురి.. మోదీ ఆకర్షణే బలం..


Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి

Read More Crime News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 09:00 AM