Minor Girl: బాబుకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని..హాస్టల్ వార్డెన్‌పై చర్యలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 02:48 PM
ఓ సంక్షేమ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు రంగంలోకి దిగి పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు.
ఓ సంక్షేమ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక(minor girl) ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు రంగంలోకి దిగి పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఆ మైనర్ బాలిక కర్ణాటక చిక్కబళ్లాపూర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్నట్లు విచారణలో తేలింది. కానీ ఆమె సక్రమంగా హాజరుకాలేదని, తరచుగా తన బంధువుల ఇంటి వద్దకు వెళ్లేదని హాస్టల్ నిర్వహకులు చెబుతున్నారు. ఇటివల ఆమె ఆగస్టులో ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెకు కడుపునొప్పి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు మెడికల్ చెకప్ కూడా నిర్వహించగా ఆమె గర్భం దాల్చలేదు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Suchana Seth Case: సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు చెప్పిన ట్యాక్సీ డ్రైవర్..
ఆ తర్వాత మరికొన్ని నెలల తర్వాత ఆమె తాజాగా ఇంటికి వెళ్లగా ఆమెకు మళ్లీ కడుపునొప్పి వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆమె గర్భవతి అని తేలింది. ఆ క్రమంలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఓ బాబుకు జన్మనించ్చింది. అయితే విషయం తెలిసిన పోలీసులు ఆ అమ్మాయిని ఆరా తీయగా 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయితో సంబంధం ఉందని ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని చెప్పిందని అన్నారు. మరోవైపు బాలుడిని ఈ విషయం గురించి అడిగితే అతను నిరాకరించినట్లు చెప్పాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగుతుందని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా అధికారులు హాస్టల్ వార్డెన్(hostel warden)తోపాటు అసిస్టెంట్‌ను కూడా సస్పెండ్ చేశారు.