Shot dead: బైక్‌పై వచ్చి ఆ నేతను కాల్చి చంపిన దుండగులు..అసలేమైంది?
ABN , Publish Date - Jan 07 , 2024 | 05:13 PM
పశ్చిమబెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఆదివారం రోజున అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు.
పశ్చిమబెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఆదివారం రోజున అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి(Satyan Chaudhary) హత్యకు గురయ్యారు. బహరంపూర్‌లో పలువురు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతన్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చిచంపినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతడిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Injury: ప్రముఖ క్రీడాకారుడికి గాయం..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!
ముర్షిదాబాద్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సత్యన్ చౌదరి మృతి పట్ల TMC నేతలు విచారం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యన్ చౌదరి ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
అయితే ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్(TMC)తో ఆయనకు దూరం పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు దుండగులు అతన్ని ఎందుకు హత్య చేశారనే విషయం తెలియలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. కాల్చి చంపిన వారు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.