Share News

Drugs: ఢిల్లీలో కలకలం.. రూ.2 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:05 PM

దేశ రాజధాని ఢిల్లీ అక్రమ రవాణాకు అడ్డగా మారుతోందా.. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను పరిశీలిస్తే అలాంటి అనుమానాలు నిజమనే చెప్పాల్సి వస్తోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ కేసును పోలీసులు ఛేదించారు.

Drugs: ఢిల్లీలో కలకలం.. రూ.2 వేల కోట్ల డ్రగ్స్ సీజ్..

దేశ రాజధాని ఢిల్లీ అక్రమ రవాణాకు అడ్డగా మారుతోందా.. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను పరిశీలిస్తే అలాంటి అనుమానాలు నిజమనే చెప్పాల్సి వస్తోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు.


దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ (Drug smuggling) కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు పోలీసులు దక్షిణ ఢిల్లీలో (South Delhi) బుధవారం దాడులు నిర్వహించారు. అనుమానాస్పందంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


నిందితుల నుంచి 565 కేజీల కిలోల కొకైన్ బయటపడింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.2000 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున కొకైన్ రవాణా చేయడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 03:14 PM