Share News

Mlas House: ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు..కోట్ల రూపాయల నగదు, 300 తుపాకులు లభ్యం

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:35 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇటివల చేసిన తనిఖీల్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు నేతల వద్ద చేసిన తనిఖీల్లో కోట్ల రూపాయల నగదుతోపాటు 300 తుపాకులు, బంగారం సహా విదేశీ ఆస్తులు కూడా లభ్యమయ్యాయి.

Mlas House: ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు..కోట్ల రూపాయల నగదు, 300 తుపాకులు లభ్యం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇటివల చేసిన తనిఖీల్లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌లకు చెందిన 20కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి అక్రమ విదేశీ ఆయుధాలు, 300 తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు, 5 కోట్ల రూపాయల నగదు, 4/5 కిలోల బంగారు బిస్కెట్లు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంలో షాక్..


అంతేకాదు భారత్‌తోపాటు విదేశాల్లో కూడా పలు ఆస్తులు(properties) ఉన్నట్లు గుర్తించామని అధికారులు అన్నారు. ఈ క్రమంలో ఇంకా సురేంద్ర పన్వార్ నివాసంలో గత 24 గంటలుగా సోదాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ ఈ-కన్సైన్‌మెంట్ కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి ఈడీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దాడిలో మైనింగ్ వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, భూమికి సంబంధించిన ప్రధాన పత్రాల గురించిన సమాచారాన్ని ఈడీ బృందం సేకరించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఈడీ(ED) అధికారుల బృందాలు గురువారం ఉదయం సోనిపట్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ సెక్టార్ 15 నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత అతని సహచరుడు సురేష్, బిజెపి నాయకుడు, కర్నాల్ మాజీ డిప్యూటీ మేయర్ మనోజ్ ఇంటిని సందర్శించాయి. దీంతోపాటు వాధ్వా, యమునానగర్‌లోని మాజీ INLD ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్ ఇల్లు, ఫామ్‌హౌస్ సహా పలు చోట్ల తనిఖీలు చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 03:45 PM