Hyderabad: 24/7 చోరీలే పని.. వయసు 42.. చోరీలు 107
ABN , Publish Date - Oct 12 , 2024 | 08:41 AM
దొంగతనాలకు రాత్రి, పగలూ లేదు. 24/7 అదే పనిలో ఉంటాడు. మహానగరంలోని ట్రై కమిషనరేట్స్ పరిధిలో అతడికి తెలియని వీధి లేదు. తిరగని గల్లీ లేదు. 19 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ, ఎన్నోసార్లు జైలుకెళ్లినా, రెండుసార్లు పీడీయాక్టు పెట్టినా బుద్ధి మారలేదు.
- నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ తాళాలు పగలగొట్టాడు
- 19 ఏళ్లుగా అదే పని
- మరోసారి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: దొంగతనాలకు రాత్రి, పగలూ లేదు. 24/7 అదే పనిలో ఉంటాడు. మహానగరంలోని ట్రై కమిషనరేట్స్ పరిధిలో అతడికి తెలియని వీధి లేదు. తిరగని గల్లీ లేదు. 19 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ, ఎన్నోసార్లు జైలుకెళ్లినా, రెండుసార్లు పీడీయాక్టు పెట్టినా బుద్ధి మారలేదు. 42 ఏళ్ల వయసులో ఇప్పటి వరకు 107 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ ఘరానా దొంగను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 123 గ్రాముల బంగారం, 202 గ్రాముల వెండి, రూ. 5వేల నగదు సహా.. మొత్తం రూ. 10లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ రామకృష్ణతో కలిసి తిరుమలగిరి ఏసీపీ రమేష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: మహిషాసురమర్ధినిగా దుర్గామాత
చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ (42) 23 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్(Rachakonda, Cyberabad, Hyderabad Commissionerate) పరిధిలోని ప్రాంతాల్లో తిరగడం, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడం, వెంటనే ఆ ఇంట్లోకి చొరబడటం, ఐరన్ రాడ్డుతో తాళాలను పగులగొట్టడం, ఆ ఇంటిని గుల్ల చేసి దొరికినంత బంగారం, వెండి నగదు దోచుకొని పరారవ్వడమే అతడి పని. రాత్రి పగలూ తేడా లేకుండా అవకాశం చిక్కిన వెంటనే చోరీలకు పాల్పడుతున్నాడు. 2005 నుంచి నేటి వరకు అతనిపై 107 దొంగతనం కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు.
అనేకసార్లు జైలు కెళ్లినా, 2016, 2024లో మేడిపల్లి, కూకట్‌పల్లి పోలీసులు పీడీయాక్టు నమోదు చేసినా అహ్మద్ తీరు మారలేదు. ఇటీవల అవేజ్ అహ్మద్ స్నేహితుడు సలామ్ బిన్‌ఆలీ తిమిమితో కలిసి 15 రోజుల్లోనే కొండాపూర్, లంగర్‌హౌజ్, తిరుమలగిరి, కార్ఖానాలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. సవాల్‌గా తీసుకున్న ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తన బృందంతో రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించి పాత రికార్డులతో మ్యాచ్ చేసి నిందితున్ని గుర్తించారు. ప్రత్యేక నిఘా పెట్టి ఘరానా దొంగ అవేజ్ అహ్మద్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News