Hyderabad: బ్లేడుదాడి ఘటనలో 8 మంది అరెస్ట్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:42 AM
బ్లేడు దాడి ఘటనలో 8 మందిని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇందుకు సంభంధించి బోయిన్‌పల్లి డీఐ సర్దార్ నాయక్, ఎస్‌ఐ శివశంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- నిందితులకు 15 రోజుల జైలు
హైదరాబాద్: బ్లేడు దాడి ఘటనలో 8 మందిని అరెస్ట్(Arrest) చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 15 రోజుల జైలు శిక్ష విధించింది. బోయిన్‌పల్లి డీఐ సర్దార్ నాయక్, ఎస్‌ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం బిహార్ రాష్ర్టానికి చెందిన నితిన్, చందన్‌కుమార్, బొలెరో వాహనాన్ని సొంత డబ్బుతో కొనుగోలు చేసి బోయిన్‌పల్లిలోని ‘హోల్‌సేల్ ఆన్ వీల్’ సంస్థలో పెట్టి సొంతంగా నడుపుకుంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: TDP: హైదరాబాద్‌లో.. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదే సంస్థలో పనిచేస్తున్న బోయిన్‌పల్లి ఆనంద్‌నగర్‌కు చెందిన యువకులు అరవింద్, సాయి, తేజ, ఖాన్, పైజాన్, బన్నీతోపాటు మరో ఇద్దరు యువకులు ఓ పార్శిల్ అందించే విషయంలో ఫోన్‌లో నితిన్, చందన్‌కుమార్(Nitin, Chandan Kumar)తో గొడపడ్డారు. మద్యం మత్తులో ఉన్న అరవింద్, సాయి, తేజ, ఖాన్, పైజాన్, బన్నీ జీవీఆర్ గార్డెన్స్ ప్రాంతం వద్దకు చేరుకొని నితిన్, చందన్‌కుమార్‌లను పిలిపించారు. వారు అక్కడికి రాగానే మాటమాట పెరిగి ఒకరినొకరు తోచుకున్నారు.
కోపంతో రగిలిపోయిన సాయి తన వద్ద ఉన్న బ్లేడుతో నితిన్, చందన్ కుమార్‌లపై దాడిచేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి సాయి అతడికి సహకరించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం తెల్లవారుజామున పరారీలో ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసి మొత్తం 8 మంది యువకులను కోర్టులో హాజరుపర్చగా, ఒక్కొక్కరికి 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దాంతో 8 మందిని జైలుకు తరలించామని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News