Share News

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ABN , Publish Date - May 30 , 2024 | 11:32 AM

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి జీడిమెట్ల(Jedimetla) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి జీడిమెట్ల(Jedimetla) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజులరామారం రోడ్డులోని ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన బాలబోయిన కుమార్‌ కుమార్తె అఖిల(22) ను అదేప్రాంతానికి చెందిన ఓరుగంటి వెంకటేష్ గౌడ్‌(Oruganti Venkatesh Goud) కుమారుడు అఖిల్‌సాయిగౌడ్‌ ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతని వేధింపులు తాళలేక ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.

దికూడా చదవండి: Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌..


దీంతో ఇరువైపుల పెద్దలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని వెంకటేష్‏పై అఖిల ఒత్తిడి తీసుకురావడంతో ‘నేను నిన్ను పెళ్లి చేసుకోను’ అని తెగేసి చెప్పాడు. దీంతో అఖిల తీవ్రమనస్తాపానికి గురై ఈనెల 28న రాత్రి 7.30గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 11:32 AM