Share News

Hyderabad: గోవా కేంద్రంగా బెట్టింగ్‌ దందా.. ఏజెంట్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:35 AM

గోవా కేంద్రంగా నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఒక కలెక్షన్‌ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: గోవా కేంద్రంగా బెట్టింగ్‌ దందా.. ఏజెంట్‌ అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: గోవా కేంద్రంగా నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌(Online Cricket Betting) దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఒక కలెక్షన్‌ ఏజెంటును అరెస్టు చేశారు. అతని నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గోవాకు చెందిన విక్రమ్‌సింగ్‌, సాగర్‌ అనే ప్రధాన బెట్టింగ్‌ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో లక్కీస్టార్‌ 123.ఇన్‌ అనే యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన చాలామంది పంటర్‌లు ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం


వారి నుంచి డబ్బులు వసూల్‌ చేయడం, ఆ డబ్బును ప్రధాన ఆర్గనైజర్స్‌కు పంపడానికి నగరంలో వికాస్‌జైన్‌ అనే కలెక్షన్‌ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా వికాస్ జైన్‌ గోవా నిర్వాహకుల అనుచరుడిగా పనిచేస్తున్నాడు. వారు చెప్పిన విధంగా పంటర్‌లకు ఐడీ, పాస్‌వర్డు షేర్‌చేయడం, బెట్టింగ్‌ మొత్తాన్ని వసూల్‌ చేయడం వికా్‌సజైన్‌ బాధ్యత. వికాస్‌ జైన్‌ సైతం సొంతంగా రాధే ఎక్సేంజ్‌ యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా..


city2.2.jpg

ఇటీవల జరిగిన టెస్టుమ్యాచ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ పోలీసులు సుల్తాన్‌ బజార్‌ పోలీసులతో కలిసి ఎంజే మార్కెట్‌ సమీపంలో వికాస్ జైన్‌ ఉంటున్న అపార్టుమెంట్‌లో దాడిచేశారు. అతని వద్ద పంటర్‌ల ఐడీలు, రూ.8లక్షల బెట్టింగ్‌ నగదు, ఒక స్కూటీ, డబ్బులు లెక్కించే మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్‌బజార్‌ పోలీసులు(Sultanbazar Police) కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!

ఇదికూడా చదవండి: Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ నిధులు..

ఇదికూడా చదవండి: Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2024 | 09:36 AM