Share News

Hyderabad: ఇంజనీరింగ్‌ విద్యార్థి దారుణ హత్య...

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:38 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Balapur Police Station) పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: ఇంజనీరింగ్‌ విద్యార్థి దారుణ హత్య...

పహాడిషరీఫ్‌(హైదరాబాద్): ఇంజనీరింగ్‌ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Balapur Police Station) పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం(Khammam) జల్లాకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్‌ ఏకైక కుమారుడు, తల్లి అనితతో కలిసి ప్రశాంత్‌ బాలాపూర్‌లో నివాసం ఉంటూ ఎంవీఎస్ఆర్‌ కాలేజ్‌(MVSR College)లో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలాపూర్‌ గణేశ్‌ చౌక్‌ వద్ద మంది అరేబియన్‌ హోటల్‌లో గల పాన్‌ షాప్‌(Pan shop) వద్ద ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు యువకులు సిగరెట్లు తాగుతున్నారు. ఈ సమయంలో స్నేహితులకు,

ఇదికూడా చదవండి: Hyderabad: ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యం


city3.jpg

ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడి చేశారు. అందులో ఒకడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్‌ కడుపులో మూడుసార్లు పొడిచాడు. ప్రశాంత్‌ రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ప్రశాంత్‌ అప్పటికే మృతిచెందాడు. మహేశ్వరం జోన్‌ డీసీపీ సునీతరెడ్డి అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపతి ఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌, టీమ్‌లతో. ఆధారాలను సేకరించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ సునీతరెడ్డి తెలిపారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................................

Hyderabad: గంజాయి మత్తులో తల్లిని చంపిన పెంపుడు కొడుకు

హైదరాబాద్: గంజాయి మత్తులో ఓ యువకుడు పెంపుడు తల్లి తలపై రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‏స్టేషన్‌(Jeedimetla Police Station) పరిధిలోని కుత్బుల్లాపూర్‌ హరిజనబస్తీలో బుధవారం రాత్రి జరిగింది. జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ హరిజన బస్తీకి చెందిన పెద్ది స్వామి, జయమ్మ(61)లకు ఐదుగురు కుమార్తెలు. మగ సంతానం లేకపోవడంతో చిన్నప్పుడే వేణు(36)ను పెంచుకున్నారు. ఆ తర్వాత వీరికి కుమారుడు పుట్టాడు. వేణు కొన్ని సంవత్సరాలుగా ఆకతాయిగా తిరుగుతున్నాడు. మద్యం, గంజాయికి బానిసైన వేణుకు వివాహం చేసిన కొంతకాలనికేభార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.


city4.jpg

అప్పటి నుంచి నిత్యం మద్యం, గంజాయి తాగుతూ కుటుంబ సభ్యులతో గొడవపడే వాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తల్లి డబ్బులు ఇవ్వలేదని తన సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టి గంజాయి తాగి ఇంటికొచ్చాడు. తల్లి జయమ్మతో గొడవపడి తలపై రాడ్డుతో కొట్టి హత్య చేసి మత్తులో పడుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న జయమ్మను కుటుంబసభ్యులు చూసి జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు సమాచారం అందించారు. వేణును విచారించగా తన తల్లిని హత్యచేసినట్టు అంగీకరించాడు. 20 రోజుల నుంచి కనిపించకుండా పోయిన మరో కుమారుడి విషయంలోనూ వేణు ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2024 | 09:38 AM