Share News

Hyderabad: చిన్నారిని చిదిమేసిన కారు..

ABN , Publish Date - Nov 26 , 2024 | 07:10 AM

ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ రెండేళ్ల చిన్నారి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ దుర్ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌(Meerpet Police Station) పరిధిలోని భూపేశ్‌గుప్తానగర్‌ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది.

Hyderabad: చిన్నారిని చిదిమేసిన కారు..

- నిర్లక్ష్యపు డ్రైవింగే కారణం?

సరూర్‌నగర్‌(హైదరాబాద్): ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ రెండేళ్ల చిన్నారి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ దుర్ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌(Meerpet Police Station) పరిధిలోని భూపేశ్‌గుప్తానగర్‌ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఏపీలోని వినుకొండకు చెందిన తిరుపతయ్య, వెంకటమ్మ(Tirupathaiah, Venkatamma) దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వలసొచ్చి భూపేశ్‌గుప్తానగర్‌(Bhupeshguptanagar)లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విషాధం.. గొంతులో పూరీలు ఇరుక్కొని విద్యార్థి మృతి


city2.jpg

సోమవారం సాయంత్రం వారి కుమార్తె బాలమ్మ(2) ఇంటి బయట ఆడుకుంటుండగా వేగంగా దూసుకు వచ్చిన కారు పాపను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. డ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు పట్టుకుని మీర్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు(Inspector Nagaraju) కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్‌ నుంచి బ్యాగుల్లో పాములు

ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్‌ స్టేడియం

ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2024 | 07:10 AM