Hyderabad: తండ్రి కళ్లెదుటే.. కూతురు దుర్మరణం..
ABN , Publish Date - Aug 27 , 2024 | 12:03 PM
వైద్య పరీక్షల నిమిత్తం కూతురిని వెంటబెట్టుకొని బైక్‌పై వెళ్తుండగా టెంపో ట్రావెల్ మినీ బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో కూతురు దుర్మరణం పాలుకాగా, తండ్రికి గాయాలయ్యాయి.
- బైక్‌ను ఢీకొన్న టెంపో ట్రావెల్ మినీబస్సు
- కూతురు మృతి, తండ్రికి గాయాలు
పంజాగుట్ట(హైదరాబాద్): వైద్య పరీక్షల నిమిత్తం కూతురిని వెంటబెట్టుకొని బైక్‌పై వెళ్తుండగా టెంపో ట్రావెల్ మినీ బస్సు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో కూతురు దుర్మరణం పాలుకాగా, తండ్రికి గాయాలయ్యాయి. పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు చెంగిచెర్లకు చెందిన శంకరరావు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)లో ఎస్‌ఐ. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లండి..
కొద్దిరోజులుగా తనకు అనారోగ్యంగా ఉండడంతో ఎర్రమంజిల్ ఏఐజీ ఆస్పత్రి(Erramunzil AIG Hospital)లో ఎండోస్కోపీ పరీక్ష కోసం సోమవారం కూతురు ప్రసన్న(25)తో కలిసి బైక్‌పై బయలుదేరాడు. బేగంపేట మెట్రోస్టేషన్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన టెంపో ట్రావెల్ మినీ బస్సు (టీఎస్10యూసి 5699) వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రసన్న అక్కడికక్కడే మృతిచెందగా, శంకర్‌రావుకు గాయాలయ్యాయి. పోలీసులు టెంపో ట్రావెల్స్ డ్రైవర్ సతీశ్‌ను అరెస్టు చేశారు.
..................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..................................................................
Hyderabad: నిండుజీవితం.. కలహాలతో ఖతం
- పెట్రోలు పోసుకొని వ్యక్తి ఆత్మహత్య
సరూర్‌నగర్(హైదరాబాద్): కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ వ్యక్తి క్షణికావేశంలో కుటుంబసభ్యులు చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడ లలితానగర్(Jillelaguda Lalitanagar) కాలనీలో నివసించే శీలం సురేష్ (37) అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసులో వ్యాన్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం దంపతుల మధ్య ఘర్షణ జరగగా, ఆవేశంలో బెడ్రూమ్‌లోకి వెళ్లిన సురేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు కాపాడేలోపే మంటల్లో కాలిపోయాడు. గదిలోని ఫర్నిచర్‌కు మంటలు అంటుకొని దట్టమైన పొగ అలుముకుంది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News