Hyderabad: గౌలిదొడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:08 PM
గౌలిదొడ్డి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software employee) అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి.. మరొకరికి గాయాలు
రాయదుర్గం(హైదరాబాద్): గౌలిదొడ్డి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software employee) అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై భానుప్రసాద్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా లక్ష్మీనర్సింహాపురం గ్రామానికి చెందిన చల్లా లోహిత్(24) రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు.
ఈ వార్తను కూాడా చదవండి: Cybercriminal: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
గౌలిదొడ్డి(Goulidodi) గ్రామంలోని ఓ పీజీ హాస్టల్‌లో నివాసం ఉంటూ నానక్‌రాంగూడ(Nanakramguda)లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బైక్‌పై తన స్నేహితుడు తెనాలికి చెందిన రావిపూడి సాయిమహేష్బాబుతో కలిసి అన్వయ కన్వెన్షన్ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ వైపు వెళ్తున్నాడు. ఇదే సమయంలో గౌలిదొడ్డి గ్రామం వైపు నుంచి ఓవర్ లోడుతో వస్తున్న టిప్పర్ వెనక నుంచి వేగంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీకొట్టింది.
దీంతో లోహిత్, మహేష్ బాబు కింద పడిపోగా టిప్పర్ లోహిత్‌పై ముందుకు దూసుకెళ్లింది. దీంతో తల పగిలి లోహిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. దారి వెంబడి వెళ్లే వారు 100కు డయల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన సాయిమహేష్‌బాబును ఆస్పత్రికి తరలించారు. అనంతరం లోహిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News