Share News

Hyderabad: హెరాయిన్‌ సరఫరా చేస్తున్న తండ్రీకుమారుల అరెస్ట్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:23 PM

డ్రగ్స్‌ రవాణా, విక్రయం, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు. రాజస్థాన్‌ నుంచి హెరాయిన్‌ సరఫరా చేస్తున్న తండ్రీకుమారులని మహేశ్వరం ఎస్‌ఓటీ, బాలాపూర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు.

Hyderabad: హెరాయిన్‌ సరఫరా చేస్తున్న తండ్రీకుమారుల అరెస్ట్‌

- రాజస్థాన్‌లో కొనుగోలు.. నగరంలో విక్రయం

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ రవాణా, విక్రయం, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు. రాజస్థాన్‌ నుంచి హెరాయిన్‌ సరఫరా చేస్తున్న తండ్రీకుమారులని మహేశ్వరం ఎస్‌ఓటీ, బాలాపూర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. నేరేడ్‌మెట్‌ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితుల వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రత్లాం జోరా ప్రాంతానికి చెందిన హనీఫ్‌ షా అలియాస్‌ హనీఫ్‌(65) స్ర్కాప్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి కుమారుడు సిద్దిక్‌ షా(31) కాస్మొటిక్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. వీరి ఇద్దరి సంపాదన కూడా కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో అధిక సంపాదన కోసం డ్రగ్స్‌ విక్రయాలు ప్రారంభించారు. రాజస్థాన్‌ ప్రతాప్‏ఘడ్‌కు చెందిన మోంటూతో పరిచయం పెంచుకున్నారు.

ఇదికూడా చదవండి: High Court: కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..


city6.jpg

అతడి వద్ద నుంచి హెరాయిన్‌ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు నగరంలో విక్రయిస్తున్నారు. వీరు మోంటూకు రూ.6 లక్షలు ఇచ్చి, 100 గ్రాముల హెరాయున్‌ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి హెరాయిన్‌ తీసుకొని నగరానికి వచ్చి బాలాపూర్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో విక్రయించే ప్రయత్నంలో ఉండగా వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు(SOT Police) దాడి చేశారు. హనీఫ్‌, సిద్దిక్‌లను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.12 లక్షల విలువైన 100 గ్రాముల హెరాయిన్‌, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రేతలను అరెస్ట్‌ చేసిన ఎస్‌ఓటీ, పోలీసులను సీపీ అభినందించారు.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 12:23 PM