Hyderabad: కరుడుగట్టిన దొంగలు అరెస్ట్.. బంగారం ఆభరణాలు స్వాధీనం
ABN , Publish Date - Dec 14 , 2024 | 07:18 AM
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను అంబర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను అంబర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అంబర్‌పేట పీఎస్(Amberpet PS)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి(East Zone DCP Balaswamy) వివరాలను వెల్లడించారు. సైదాబాద్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆవేజ్ అహ్మద్(42), సైదాబాద్‌లో నివాసం ఉంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సులు..
చార్మినార్ కిషన్‌బాగ్‌లో నివాసం ఉండే అబూద్ బిన్ హాజీ బిల్స్‌దా (28) ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహ్మద్ ఆవేజ్ అహ్మద్ ఇది వరకు నగరంలోని పలు పీఎస్‌లలో 110 దొంగతనాలు చేసి పలుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదైంది. జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. గత నవంబరులో వీరు జైలు నుంచి బయటకు వచ్చారు. ఈనెల 2వ తేదీన బాగ్‌అంబర్‌పేట సాయిబాబానగర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అడ్వకేట్ శివశంకర్(Advocate Shivshankar) ఇంట్లో ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు తస్కరించారు.
చోరీ చేసిన బంగారాన్ని చార్మినార్‌లోని నితీష్ కిషన్ పాటిల్ అనే బంగారు వ్యాపారికి అమ్మారు. కేసును సీఐ అశోక్ సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం గోల్నాకలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆవేజ్ అహ్మద్, అబూద్ బిన్ హాజీ బిల్స్‌దాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కాచిగూడ పీఎస్ పరిధిలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఈస్ట్‌జోన్ అదనపు డీసీపీ జోగుల నర్సయ్య, కాచిగూడ ఏసీపీ రఘు, అంబర్‌పేట సీఐ అశోక్, డీఐ మల్లీశ్వరీ, కాచిగూడ డీఐ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News