Share News

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

ABN , Publish Date - Jul 12 , 2024 | 10:17 AM

విశాఖ ఏజెన్సీ, అరకు లంబసింగి(Araku Lambasingi) ప్రాంతాల నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ను నగరానికి సరఫరా చేసి, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఆటకట్టించారు సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. మారేడుపల్లి పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకోవడమే కాకుండా నిందితుడి నుంచి రూ. 4,22,500 విలువైన 825 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ స్మగ్లర్‌ అరెస్ట్‌..

- రూ. 4.22 లక్షల విలువైన హాష్‌ ఆయిల్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: విశాఖ ఏజెన్సీ, అరకు లంబసింగి(Araku Lambasingi) ప్రాంతాల నుంచి గంజాయి, హాష్‌ ఆయిల్‌ను నగరానికి సరఫరా చేసి, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఆటకట్టించారు సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. మారేడుపల్లి పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకోవడమే కాకుండా నిందితుడి నుంచి రూ. 4,22,500 విలువైన 825 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీఎస్‌ సుదీంద్ర(Task Force DCP YVS Sudindra) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా అబ్బాపూర్‌కు చెందిన దూసరి నవీన్‌గౌడ్‌ గతంలో గంజాయి సరఫరా చేస్తూ నిజామాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. నిజామాబాద్‌ జైల్లో అతడికి అరకు లంబసింగి ప్రాంతానికి చెందిన గంజాయి స్మగ్లర్‌ వంతాల ఏసయ్య పరిచయమయ్యాడు. అరకు లంబసింగిలో హాష్‌ ఆయిల్‌(గంజాయి తైలం)ను విక్రయిస్తే అధిక లాభాలు ఉంటాయని, ట్రాన్స్‌పోర్టు చేయడం చాలా సులభమని చెప్పాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: మందుబాబులకు జైలుశిక్ష..


ఆ తర్వాత ఇద్దరూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నవీన్‌గౌడ్‌ రైల్లో అరకు వెళ్లాడు. అక్కడ ఏసయ్యను కలిసి రూ. 50 వేలు చెల్లించి హాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి తిరిగి సికింద్రాబాద్‌ చేరుకున్నాడు. జేబీఎస్‌ చేరుకున్న అతడు కొంతమంది కస్టమర్లకు హాష్‌ ఆయిల్‌ను విక్రయించేందుకు వేచి ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్‌వె్‌స్ట టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తన బృందంతో రంగంలోకి దిగారు. మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ బృందంతో కలిసి సంయుక్తంగా దాడి చేసి నవీన్‌గౌడ్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి 825 గ్రాముల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులతో పాటు.. ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు, అశోక్‌నగర్‌ పరిధిలోని యువతకు కొంతకాలంగా హాష్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్నట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మారేడుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 10:17 AM