Share News

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 08:24 AM

నగర సందర్శనకు వచ్చిన మహారాష్ట్ర(Maharashtra) యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‏స్టేషన్‌(LB Nagar Police Station) పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ ప్రేమ్‌నగర్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ పట్లే(30) మీర్‌పేట బడంగ్‌పేట్‌ అన్నపూర్ణ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

- నగర సందర్శనకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర యువతి మృతి

హైదరాబాద్: నగర సందర్శనకు వచ్చిన మహారాష్ట్ర(Maharashtra) యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‏స్టేషన్‌(LB Nagar Police Station) పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ ప్రేమ్‌నగర్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ పట్లే(30) మీర్‌పేట బడంగ్‌పేట్‌ అన్నపూర్ణ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ముస్తాబైన చర్లపల్లి టెర్మినల్‌..


అతడి స్నేహితురాలు మహారాష్ట్ర షోలాపూర్‌ త్రిమూర్తినగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ప్రియాంక గాదే(26) గత ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లో పర్యాటక స్థలాలను చూసేందుకు వచ్చి నాంపల్లిలోని ఓ హోటల్‌లో ఉంటోంది. గురువారం ఉదయం నాంపల్లి నుంచి ఇద్దరూ బైకుపై రామోజీఫిల్మ్‌సిటీ(Ramoji Film City) చూసేందుకు బయలుదేరారు. ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం వారి బైకును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు.


city4.2.jpg

ప్రియాంక గాదే తలపై నుంచి డీసీఎం వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. భయాందోళనకు గురైన డ్రైవర్‌ డీసీఎం వాహనాన్ని వనస్థలిపురం దారిలో వదిలి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. తర్వాత పోలీసులు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోహిత్‌కుమార్‌(Rohit Kumar) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 08:24 AM