Share News

Hyderabad: పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం..

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:30 AM

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆస్ట్రేలియా(Australia)కు పారిపోతున్న యువకుడిని మహాకాళి పోలీసులు మంగళవారం ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహాకాళి ఇన్‌స్పెక్టర్‌ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్ గఢ్‌ రాయ్‌పూర్‌(Chhattisgarh Raipur) జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్‌కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

Hyderabad: పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం..

- విదేశాలకు పారిపోతున్న యువకుడి అరెస్టు

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆస్ట్రేలియా(Australia)కు పారిపోతున్న యువకుడిని మహాకాళి పోలీసులు మంగళవారం ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహాకాళి ఇన్‌స్పెక్టర్‌ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్ గఢ్‌ రాయ్‌పూర్‌(Chhattisgarh Raipur) జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్‌కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో బండారం స్వామి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తాను సికింద్రాబాద్‌(Secunderabad)లోని పార్క్‌లేన్‌ వద్ద ఓ హోటల్‌లో ఉన్నట్లు ఆ యువతికి చెప్పాడు. స్వామిని కలవడానికి ఆ యువతి రాయ్‌పూర్‌(Raipur) నుంచి సికింద్రాబాద్‌లోని హోటల్‌కు వచ్చింది.

ఇదికూడా చదవండి: Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్‌.. మహిళ కాలికి గాయం


పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ యువతిని లోబర్చుకున్నాడు. అనంతరం తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గాలేదని పెళ్లి విషయం తరువాత మాట్లాడుదామని యువతిని పంపించాడు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన యువతి ఈనెల 28న రాయ్‌పూర్‌లోని విధాన్‌సభ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సంఘటన జరిగిన నగర కమిషనరేట్‌ పరిధిలోని మహాకాళి పోలీస్ స్టేషన్‌కు కేసును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. సోమవారం రాత్రి ఫిర్యాదు అందుకున్న మహాకాళి పోలీసులు 69బీఎన్‌ఎస్ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.


సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బండారం స్వామి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి శ్రీలంక మీదుగా ఆస్ర్టేలియా(Australia) వెళ్లే విమానాన్ని ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు టీమ్‌లుగా ఏర్పడి రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇమ్మిగ్రేషన్‌, సీఐఎస్ఎఫ్‌ అధికారుల సహకారంతో విమానంలో ఉన్న స్వామిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం స్వామిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌, ఎస్‌ఐలు పరదేశీ జాన్‌, కానిస్టేబుళ్లను ఉత్తర మండల డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ అభినందించారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 11:30 AM