Hyderabad: మాటలు కలిపి.. మభ్యపెట్టి.. కదులుతున్న బస్సులోనే అత్యాచారం
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:04 AM
ఆమెతో మాటలు కలిపి మంచివాడిగా నటించాడు. ఒకే ఊరివాడు కావడంతో సహాయం చేస్తున్నాడని నమ్మింది. అదునుచూసి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం ఘటనకు చెందిన వివరాలను ఉస్మానియా వర్సిటీ ఏసీపీ జగన్(Osmania University ACP Jagan), ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌తో కలిసి ఏసీపీ కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వెల్లడించారు.
- సహాయం చేస్తున్నట్లు నటించి ఘాతుకం
- వివరాలను వెల్లడించిన డీసీపీ
హైదరాబాద్: ఆమెతో మాటలు కలిపి మంచివాడిగా నటించాడు. ఒకే ఊరివాడు కావడంతో సహాయం చేస్తున్నాడని నమ్మింది. అదునుచూసి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం ఘటనకు చెందిన వివరాలను ఉస్మానియా వర్సిటీ ఏసీపీ జగన్(Osmania University ACP Jagan), ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌తో కలిసి ఏసీపీ కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వెల్లడించారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్(Adilabad District Nirmal) నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో బయలుదేరింది. డ్రైవర్ రామగిరి సిద్దయ్య (32), అదనపు డ్రైవర్ ఈర్ల కృష్ణ (31) ఉన్నారు. 9 ఏళ్ల కుమార్తెతో ఓ మహిళ బస్సు ఎక్కింది.
ఇదికూడా చదవండి: Kishan Reddy: నామమాత్రంగా మాఫీ..
డ్రైవర్ కృష్ణ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలిపాడు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తేలడంతో మంచితనం నటించాడు. రాత్రి 10:30 ప్రాంతంలో ఓ హోటల్ వద్ద అందరూ భోజనాలు చేసే సమయంలో డ్రైవర్ కృష్ణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఒకటో నంబర్ సీటు రిజర్వేషన్ చేసుకున్న ఆమెకు ఖాళీగా ఉన్నాయంటూ 5, 6 నంబర్‌సీట్లు(స్లీపర్ బెర్తులు) ఇచ్చి కుమార్తెతో విశ్రాంతి తీసుకోండి అని సహాయం చేస్తున్నట్లు నటించాడు. దీంతో ఆమె అందుకు సరే అంది. ఆతర్వాత బస్సు నడిపే బాధ్యతను సిద్ధయ్య(Siddhiya)కు అప్పగించిన కృష్ణ రాత్రి 12గంటల ప్రాంతంలో ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉండగా ఆమె వద్దకు వెళ్లాడు. 12:15 సమయంలో అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఇదికూడా చదవండి: Currency Notes: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి..
మేలుకున్న మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో కృష్ణ బెడ్‌షీట్‌ను మహిళ నోట్లో కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత డ్రైవర్ సిద్దయ్య పక్క సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. షాక్ నుంచి కొద్దిసేపటికి తేరుకున్న మహిళ తోటి ప్రయాణికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్(Hyderabad) పోలీసులు సరిగ్గా 3 నిమిషాల్లోనే బస్సును ట్రేస్ చేసి తార్నాక మెట్రోస్టేషన్ వద్ద ఆపారు. అప్పటికే కృష్ణ బస్సులోంచి దూకి పారిపోయాడు. మరో డ్రైవర్ రామగిరి సిద్ధయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బస్సును సీజ్ చేశారు. కృష్ణ కోసం గాలించి యాచారం పరిధిలో బుధవారం అరెస్టు చేశారు. బాధిత మహిళను భరోసా సెంటర్‌కు తరలించారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News