Share News

Hyderabad: టార్గెట్‌ న్యూ ఇయర్‌ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్‌

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:30 PM

న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా.. ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌(MDMA drugs)ను తెచ్చి నగరంలో విక్రయించడానికి ప్రయత్నించిన స్మగ్లర్‌ను టీజీ న్యాబ్‌, హైదరాబాద్‌ సిటీ పోలీసులు(Hyderabad City Police) సంయుక్తంగా అరెస్టు చేశారు.

Hyderabad: టార్గెట్‌ న్యూ ఇయర్‌ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్‌

- స్మగ్లర్‌ అరెస్ట్‌, రూ. 25లక్షల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

- పరారీలో మరో ఇద్దరు నిందితులు

హైదరాబాద్‌ సిటీ: న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా.. ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌(MDMA drugs)ను తెచ్చి నగరంలో విక్రయించడానికి ప్రయత్నించిన స్మగ్లర్‌ను టీజీ న్యాబ్‌, హైదరాబాద్‌ సిటీ పోలీసులు(Hyderabad City Police) సంయుక్తంగా అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు స్మగ్లర్స్‌ పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ అమీర్‌ అలియాస్‌ వసీంఖాన్‌ అలియాస్‌ హబీబ్‌ మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. ఆ తర్వాత తనకు డ్రగ్స్‌ సప్లై చేసిన వారి సహకారంతో ముంబైకి చెందిన మహ్మద్‌ సలీం అబ్దుల్‌ అహ్మద్‌ షేక్‌ను పరిచయం చేసుకుని తానే డ్రగ్స్‌ సప్లయర్‌గా మారాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఒకరనుకొని మరొకరిని చితక బాదారుగా...


ముంబైలో రూ. 3వేలు.. నగరంలో రూ.8వేలు

డ్రగ్స్‌ను కొనుగోలు చేయడానికి తరచుగా ముంబై(Mumbai) వెళ్తున్న అమీర్‌.. అక్కడ ప్రధాన డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ అయిన మహ్మద్‌ సలీం, రయీజ్‌ రియాజ్‌ షేక్‌ను కలిసేవాడు. వారి వద్ద ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను రూ.3000 చొప్పున కొనుగోలు చేసేవాడు. సరుకును గుట్టుగా నగరానికి తెచ్చి రూ.8000 చొప్పున విక్రయించే వాడు.

city8.2.jpg


ఈ క్రమంలో ముంబై నుంచి పెద్దఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్‌ను నగరానికి తెచ్చిన నిందితుడు సిటీలోని నాంపల్లి ప్రాంతంలో పలువురు కస్టమర్లకు విక్రయిస్తుండగా.. టీజీ న్యాబ్‌, నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి అమీర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.25లక్షల విలువైన 320 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌ చైన్‌లింకు ఆధారంగా ముంబై స్మగ్లర్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

city8.jpg


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 01:30 PM