Share News

Hyderabad: అంబర్‌పేటలో ఇద్దరు అదృశ్యం..

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:24 AM

అంబర్‌పేట(Amberpet) పీఎస్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాలలో నివాసం ఉండే ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు ఉన్నారు. ఎస్‌ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట జమ్‌జమ్‌ మసీదు(Bagh Amberpet Zamzam Masjid) వద్ద నివాసం ఉండే నౌషాద్‌ భార్య షహనాజ్‌ ఖాతూన్‌ మానసిక పరిస్థతి సక్రమంగా లేదు.

Hyderabad: అంబర్‌పేటలో ఇద్దరు అదృశ్యం..

హైదరాబాద్: అంబర్‌పేట(Amberpet) పీఎస్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాలలో నివాసం ఉండే ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు ఉన్నారు. ఎస్‌ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట జమ్‌జమ్‌ మసీదు(Bagh Amberpet Zamzam Masjid) వద్ద నివాసం ఉండే నౌషాద్‌ భార్య షహనాజ్‌ ఖాతూన్‌ మానసిక పరిస్థతి సక్రమంగా లేదు. ఆమె మూడు నెలలుగా అదే ప్రాంతంలో ఉండే తన తల్లిగారి ఇంటిలో ఉంటుంది. ఈ క్రమంలో గత నెల 27వ తేదీ సాయంత్రం 4గంటల సమయంలో షహనాజ్‌ ఖాతూన్‌(Shahnaz Khatoon) ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికిరాలేదు. ఆమె కోసం ఎంతవెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 27వ తేదీన ఆమె సోదరుడు మహ్మద్‌ ఫాయాజ్‌ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: తాగి నడిపారు.. జైలుకెళ్లారు


అదేవిధంగా బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలోని నారాయణ కాలేజీ హస్టల్‌లో అస్సాం రాష్టా్ట్రనికి చెందిన పెంకి శివ(Penki Shiva) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనతోపాటు ఆయన భార్య రీతూ(Ritu) కూడా హస్టల్‌లో ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీన శివ తన ఫోన్‌ స్వీచాఫ్‌ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆయన కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆయన భార్య రీతూ ఈ నెల 27వ తేదీన అంబర్‌పేట పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ మౌనిక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

city4.jpg


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 11:24 AM