Share News

Hyderabad: రెండు రాష్ట్రాలు.. 33 పోలీస్‌ స్టేషన్లు.. 74 చైన్‌స్నాచింగ్‌లు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:46 PM

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని ఎల్బీనగర్‌ సీసీఎస్‌, రాచకొండ ఐటీ సెల్‌, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: రెండు రాష్ట్రాలు.. 33 పోలీస్‌ స్టేషన్లు.. 74 చైన్‌స్నాచింగ్‌లు

- అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్‌ అరెస్ట్

- రూ.9లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని ఎల్బీనగర్‌ సీసీఎస్‌, రాచకొండ ఐటీ సెల్‌, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌బాబు(LB Nagar Crime DCP Arvind Babu) వివరాలను వెల్లడించారు. కర్ణాటక రా ష్ట్రం ధార్వడ జిల్లా కొలివాడ గ్రామానికి చెందిన అచుత్‌కుమార్‌ గని అలియాస్‌ విశ్వనాథ్‌ కొలివాడి(34) వృత్తిరీత్యా డ్రైవర్‌. అయితే జల్సాల కు అలవాటు పడిన అచుత్‌కుమార్‌ సులువుగా డబ్బులు సంపాదించడం కోసం చైన్‌స్నాచింగ్‌లను ఆదాయమార్గంగా ఎంచుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి..


2015 నుంచి 74 స్నాచింగ్‌లు..

ఈ క్రమంలో 2015లో మొదటి సారి కర్నాటకలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ అధునాతన బైక్‌లను కొనుగోలు చేసేవాడు. ఆ బైక్‌లను ఉపయోగించి ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌ చేసి, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. అయితే 2018లో జ్నానభారతి పోలీసులు అచుత్‌కుమార్‌ను అరెస్ట్‌చేసి బెంగుళూరులోని అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు.

city9.2.jpg


జైలు నుంచి వచ్చినా మారనితీరు..

నాలుగున్నరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అచుత్‌కుమార్‌ తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. ఇక్కడ కూడా అతని తీరు మారలేదు. నగరంలో కూడా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌(Chaitanyapuri Police Station) పరిధిలో ని మోహన్‌నగర్‌ నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఐటీ విభాగం అధికారులు సాంకేతిక టెక్నాలజీ ద్వారా అచుత్‌కుమార్‌ వెళ్తున్న స్థలాన్ని గుర్తించారు.


సమాచారం అందుకున్న ఎల్బీ నగర్‌ సీసీఎస్‌ పోలీసులు, చైతన్యపురి పోలీసులు కలిసి మోహన్‌నగర్‌లో అచుత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు అం గీకరించాడు. దీంతో అతని వద్ద నుంచి రూ. 2.50లక్షల నగదు, సుమారు 5.9 తులాల బం గారు ఆభరణాలు, బైక్‌, సెల్‌ఫోన్‌లను స్వాధీ నం చేసుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న స్నాచర్‌ను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని క్రైమ్‌ డీసీపీ అరవింద్‌బాబు అభినందించారు.


2024 లో కర్నాటక రాష్ట్రంలో 8 దొంగతనాలు, రాచకొండ కమిషనరేట్‌(Rachakonda Commissionerate) పరిధిలోని జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒక దొంగతనం, చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేగాక ఇప్పటి వరకు కర్నాటక, తెలంగాణ రెండు రాష్ర్టాలలోని 33 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 74 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..

ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం

ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు

ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2024 | 12:46 PM