Hyderabad: వామ్మో.. మళ్లీ దోచేశారుగా.. ఈసారి రూ.15.86 లక్షలకు టోకరా..
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:47 PM
‘మనీ ల్యాండరింగ్ కేసులో మీ పాత్ర ఉందని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) బెదిరింపులకు పాల్పడి ఓ వృద్ధుడి ఖాతా నుంచి రూ.15.86లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి.
- మనీ ల్యాండరింగ్ పేరిట వృద్ధుడికి సైబర్ నేరగాళ్ల బెదిరింపు
హైదరాబాద్ సిటీ: ‘మనీ ల్యాండరింగ్ కేసులో మీ పాత్ర ఉందని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) బెదిరింపులకు పాల్పడి ఓ వృద్ధుడి ఖాతా నుంచి రూ.15.86లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రిటైర్డ్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ మీద అంధేరీ పోలీస్ స్టేషన్‌లో మనీ ల్యాండరింగ్ కేసు నమోదైందని, రాజ్‌కుంద్రా చేసిన రూ. వందలకోట్ల కుంభకోణంలో మీకూ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. మీపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని, మనీ ల్యాండరింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం.. మీకున్న మొత్తం ఆస్తులతో పాటు మీ భార్య నగలన్నీ జప్తు చేస్తాం అంటూ బెదిరించారు. ఆ తర్వాత కాల్‌ను సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్‌కు బదిలీ చేస్తున్నాం అంటూ నమ్మించి మరో వ్యక్తితో మాట్లాడించాడు. మనీ ల్యాండరింగ్ కేసును త్వరలోనే సీబీఐకి అప్పగిస్తున్నాం. ఈ కుంభకోణంలో మీ పాత్ర ఉందో లేదో తేలంతవరకు మీ ఆస్తులు, మీ భార్య నగలూ జప్తు చేస్తాం’ అంటూ సుమారు రెండు గంటలకు పైగా కేసు గురించి వివరిస్తూ వృద్ధుడిని భయబ్రాంతులకు గురిచేశారు. మరుసటిరోజు వీడియోకాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తు లు సీబీఐ నుంచి మాట్లాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చారు.
ఇదికూడా చదవండి: Hyderabad: నాడు టీఆర్‌ఎస్.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం
ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది అని భయపెట్టారు. మిమ్మల్ని కేసు నుంచి బయట పడేయాలంటే తమ ఉన్నతాధికారితో మాట్లాడుకోవాలని నమ్మించారు. అలా బాధితున్ని ముగ్గులోకి దింపిన నేరస్థులు కేసులోంచి బయటపడేస్తామంటూ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు లో దాచుకున్న డబ్బు మొత్తం రూ.15.86 లక్షలు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఆ తర్వాత ఆలోచనలో పడ్డ బాధితుడు ఇదంతా కుట్రలా ఉందని అనుమానించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News