Hyderabad: పోలీస్ అధికారి వేధింపులపై మహిళ ఫిర్యాదు?
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:36 AM
పోలీసు అధికారి తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ... బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని ఓ మహిళ హయత్‌నగర్(Hayatnagar) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేసింది.
- సోషల్ మీడియాలో పోస్టు
- నగలు చేయిస్తానని మోసం చేసిందని మహిళపై ఫిర్యాదు
- బాధితుల్లో సీఐ భార్య
హైదరాబాద్: పోలీసు అధికారి తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ... బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడని ఓ మహిళ హయత్‌నగర్(Hayatnagar) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేసింది. అయితే, ఆమె బంగారం చేయిస్తానని తమ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందని కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఓ సీఐ భార్య ఉండటం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ(Vijayawada)కు చెందిన సువర్చల (36), కిరణ్‌కుమార్ దంపతులు కొంతకాలంగా మునగనూర్‌లోని ద్వారక వెంకట సాయినగర్ కాలనీలో నివాసముంటున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: విమానాల్లో నగల చోరీలు.. వృద్ధ, మధ్య వయస్కులైన మహిళలే టార్గెట్
స్థానికంగా బోటిక్ నిర్వహిస్తున్న స్వాతి, అనిత, మరికొంతమంది మహిళలు సువర్చలకు పరిచయమయ్యారు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలు నచ్చడంతో తమకూ అలాంటివి కావాలనిఅనిత, ప్రణీత కోరారు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర చేయిస్తానని సువర్చల నమ్మబలకడంతో అనిత రూ. 14 లక్షలు, ప్రణీత 11.50 లక్షలు ఇచ్చారు. డబ్బులు తీసుకొని నగలు ఇవ్వకుండా మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తుండగా, నగలు చేయించి ఇచ్చానని సువర్చల చెబుతోంది. జరిగిన విషయాన్ని అనిత తన భర్త (ఇన్‌స్పెక్టర్)కు చెప్పగా అతడు సువర్చల ఇంటికి వెళ్లి నిలదీశాడు. భర్త లేని సమయంలో వచ్చి వేధిస్తున్నాడని, బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకున్నాడని సువర్చల ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదుచేసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: రాగి + ఇనుము = బంగారం...
సువర్చల పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపిస్తూ బాధితులు శుక్రవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సువర్చల దంపతుల వివరణ కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా విజయవాడ వెళుతున్నామని, రెండు రోజుల తరువాత వస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారి గురించి ఆరా తీస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి తెలిపారు. వాస్తవాలు పరిశీలించి ఉన్నతాధికారుల సూచనతో కేసు నమోదు చేస్తామన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News