Share News

Drug Seized: ఏకంగా రూ.2500 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం..అదుపులో ఐదుగురు

ABN , Publish Date - Feb 21 , 2024 | 11:19 AM

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ దందాలో ఒకటైన కేసును పోలీసులు ఛేదించారు. గత రెండు రోజులుగా ఢిల్లీ, పుణె ప్రాంతాల్లో చేసిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Drug Seized: ఏకంగా రూ.2500 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం..అదుపులో ఐదుగురు

గత రెండు రోజులగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా పుణె ప్రాంతాల్లో జరిగిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా మాదకద్రవ్యాలు(drug seized) పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో ఏకంగా 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ (MD)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను 'మియావ్ మియావ్' అని కూడా పిలుస్తున్నారు. దీని విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూణెలో 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు డ్రగ్స్(drugs) స్మగ్లర్లను అరెస్టు చేయడంతో ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ వ్యక్తులను తదుపరి విచారణ చేయగా ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలోని గోదాం లాంటి నిర్మాణాల నుంచి అదనంగా 400 కిలోల సింథటిక్ ఉత్ప్రేరకాలు లభించాయని అధికారులు చెప్పారు. ఇది వెలుగులోకి రావడంతో దేశంలోని అతిపెద్ద డ్రగ్స్ బస్ట్‌లలో ఇది ఒకటని మారిందని పోలీసులు(police) చెబుతున్నారు.


కుర్కుంభ్ MIDC వద్ద ఉన్న యూనిట్ల నుంచి న్యూఢిల్లీలోని పలు కేంద్రాలకు ఈ వస్తువులు రవాణా అవుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు(arrest) చేశారు. వీరిలో ముగ్గురు కొరియర్‌లు కాగా.. మరో ఇద్దరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. అరెస్టయిన వ్యక్తులను పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ కొరియర్ బాయ్స్‌గా అభివర్ణించారు. వారిపై గతంలో కూడా నేరాలు నమోదయ్యాయని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: అబ్బో.. ఈ యువకుడి పైత్యం మామూలుగా లేదుగా.. నాకే చలానా రాస్తావా.. నీ అంతు చూస్తా అంటూ..

Updated Date - Feb 21 , 2024 | 11:19 AM