Share News

Hyderabad: సోషల్ మీడియా చేసిన సహాయం.. బెంగళూరు బాలుడు హైదరాబాద్ లో..

ABN , Publish Date - Jan 24 , 2024 | 04:04 PM

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో ఈ పదం తెలియనివారు ఉండరేమో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సంఘటనలు జరిగాయి.

Hyderabad: సోషల్ మీడియా చేసిన సహాయం.. బెంగళూరు బాలుడు హైదరాబాద్ లో..

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో ఈ పదం తెలియనివారు ఉండరేమో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సంఘటనలు జరిగాయి. నేరాలు, దొంగతనాలు, మోసాలు, హత్యల వరకూ ఎన్నో చూశాం. అందుకే సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని సురక్షితంగా కలిపింది. బెంగళూరుకు చెందిన పరిణవ్ అనే 12 ఏళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. కోచింగ్ సెంటర్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యాడు. సమయం గడుస్తున్నా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెదికారు. తెలిసిన వారిని వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించి కీలక విషయాలు తెలుసుకున్నారు. జనవరి 21న ఉదయం 11 గంటలకు కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం బస్సులో అక్కడి నుంచి మేజిస్టిక్ బస్టాండ్‌కు వెళ్లాడు. అయితే బస్టాండులో అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఉండటంతో బాలుడు ఎక్కడికి వెళ్లాడు అనే విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. సీసీ ఫుటేజీకి సంబంధించిన వీడియోలను బాలుడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

అదృశ్యమైన బాలుడిని హైదరాబాద్‌ నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద చూసినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ బాలుడితో తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడించారు. ఆ బాలుడు తమ కుమారుడే అని ఆ తల్లిదండ్రులు గుర్తించారు. తన కుమారుడి ఆచూకీ కనుగొనిన నెటిజన్ యూజర్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 24 , 2024 | 04:05 PM