Accident: రెండు వాహనాలను ఢీ కొట్టిన ట్రక్కు...తొమ్మిది మంది మృతి
ABN , Publish Date - Feb 26 , 2024 | 07:17 AM
ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రక్కు, కారు, బైక్ ఢీకొట్టాయి. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లోని కైమూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
బిహార్(bihar)లోని కైమూర్(Kaimur) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో ఇద్దరు మహిళలు సహా 9 మంది దుర్మరణం చెందారు. అందిన సమాచారం ప్రకారం ఆదివారం అర్థరాత్రి వేగంగా వెళ్తున్న లారీ, కారు, బైక్ ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Nafe Singh Rathee: కారుపై 40 రౌండ్ల కాల్పులు..INLD చీఫ్, సెక్యూరిటీ గార్డు మృతి
ప్రమాదంపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దిలీప్ కుమార్(police) మాట్లాడుతూ కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు. ఆ కారు మొదట ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందని.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని భావిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. కారు, బైక్ ఢీకొట్టి ప్రమాదం జరుగగా.. ఆ క్రమంలో వేగంగా వచ్చిన ట్రక్కు వాటిని ఢీకొందని చెప్పారు. మృతులను ఇంకా పూర్తిగా గుర్తించలేదు. లారీని సీజ్ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం అర్థరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో కైమూర్‌లోని మోహానియా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి(chief minister) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సహాయం అందించాలని IAS సీనియర్ అధికారులను ఆదేశించారు.