Share News

Hyderabad: ఇంటి తాళాలు పగులకొట్టి 30 తులాల బంగారు చోరీ...

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:50 PM

ఇంటి తాళాలు పగులకొట్టి గుర్తు తెలియని దొంగలు ఇంట్లోని 30 తులాల బంగారు, 1 కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‏స్టేషన్‌(Abdullapurmet Police Station) పరిధిలోని తారామతిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: ఇంటి తాళాలు పగులకొట్టి 30 తులాల బంగారు చోరీ...

- కిలో వెండి ఆభరణాల అపహరణ

- పరిశీలించిన ఏసీపీ,

- వివరాలు సేకరించిన క్లూస్‌టీం

హైదరాబాద్: ఇంటి తాళాలు పగులకొట్టి గుర్తు తెలియని దొంగలు ఇంట్లోని 30 తులాల బంగారు, 1 కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‏స్టేషన్‌(Abdullapurmet Police Station) పరిధిలోని తారామతిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ శివారు తారామతిపేటకు చెందిన ఏపూరి మధుచారి గోల్డ్‌స్మిత్‌ పనులు చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తాళంవేసి అతడి తల్లిని నాగోల్‌లోని సోదరి వద్ద వదిలిపెట్టాడు. కుమారుడికి జ్వరం వచ్చిందని మధుచారి భార్య ఫోన్‌ చేయడంతో బోయిన్‌పల్లిలోని అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం గేటు, డోర్‌ తెరిచి ఉండడంతో ఇంటి పక్కన వాళ్లు మధుచారికి సమాచారం అందించారు.

ఇదికూడా చదవండి: జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద కుంగిన రోడ్డు..


ఇంటికి వచ్చిన అతడు లోపలికి వెళ్లి చూడగా అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. అందులోని 30 తులాల బంగారు, 1 కిలో వెండి ఆభరణాలు కనిపించలేదు. వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి(Vanasthalipuram ACP Kashireddy), ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. 5 ఏళ్ల క్రితం కూడా ఇదే ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 12:50 PM