Share News

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్

ABN , Publish Date - Jun 23 , 2024 | 09:18 AM

లైంగిక వేధింపుల కేసు(sexual harassment case)లో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ(MLC) సూరజ్ రేవణ్ణ(Suraj Revanna)ను కర్ణాటక పోలీసులు(police) ఆదివారం అరెస్టు చేశారు.

 Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్
Suraj Revanna arrested

లైంగిక వేధింపుల కేసు(sexual harassment case)లో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్సీ(MLC) సూరజ్ రేవణ్ణ(Suraj Revanna)ను కర్ణాటక పోలీసులు(karnataka police) ఆదివారం అరెస్టు చేశారు. జూన్ 16న ఫామ్‌హౌస్‌లో లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ శనివారం(జూన్ 22న) హాసన్ జిల్లాలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్‌లో జెడి(ఎస్) మహిళా కార్యకర్త సూరజ్‌పై కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ ఆమెతో బలవంతంగా లైంగిక సంపర్కం చేసినట్లు ఆమె తెలిపింది.


లోక్‌సభ ఎన్నికలలో తన పనిని చూసి సూరజ్ రేవణ్ణ(Suraj Revanna) ఫోన్ నంబర్‌ అడిగారని ఆమె చెప్పింది. ఆ క్రమంలో ఖాళీగా ఉన్నప్పుడల్లా తనను కలవాలని కోరినట్లు వెల్లడించింది. గన్నికాడ గ్రామంలోని తన పొలానికి రావాలని సూరజ్ రేవణ్ణ కోరారని, పొలానికి చేరుకున్న తర్వాత సూరజ్ గది లోపలి నుంచి తాళం వేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత రాజకీయాల్లో ముందుకు వెళ్లేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని స్పష్టం చేసింది. ఆ తర్వాత తాను రానని చెప్పడంతో బెదిరించాడని, ఫోన్ చేసినప్పుడల్లా పొలానికి రావాలని కోరాడని ఫిర్యాదుదారు పేర్కొంది.


ఆ క్రమంలోనే జూన్ 17న సూరజ్ రేవణ్ణ సన్నిహితుడు శివ అనే వ్యక్తికి ఈ విషయంపై బెదిరించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటపెట్టొద్దని అందుకోసం రూ.2 కోట్లు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారని వెల్లడించింది. ప్రాణభయంతో జూన్ 19న (బుధవారం) బెంగళూరు వెళ్లి డీజీపీని కలిసి రాతపూర్వకంగా దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ఫిర్యాదు అనంతరం హోలెనరసిపుర రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌(police station)లో ఫిర్యాదు చేయగా సూరజ్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.


సూరజ్ రేవణ్ణ (JDS) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ(HD Revanna) కుమారుడు, హాసన్ మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ అన్నయ్య. ప్రస్తుతం పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసుల కస్టడీలో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జేడీ(ఎస్)(JDS) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే సూరజ్ రేవణ్ణ ఘటన చోటు చేసుకుంది. అశ్లీల వీడియో కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.


ఇది కూడా చదవండి:

NEET UG 2024: నీట్ యూజీ ఎగ్జామ్ కూడా రద్దవుతుందా..విద్యార్థుల్లో భయాందోళన


Srinagar : అమరథ్ యాత్రకు సర్వం సిద్ధం

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!


Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 23 , 2024 | 09:22 AM