Virat Kohli: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మొట్టమొదటి ఆటగాడిగా అవతరణ
ABN , Publish Date - Jun 23 , 2024 | 08:00 AM
‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సత్తా గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే విరాట్ ఓ సూపర్ మ్యాన్‌గా మారిపోతాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శనివారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఆకట్టుకున్నాడు.
‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సత్తా గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే విరాట్ ఓ సూపర్ మ్యాన్‌గా మారిపోతాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శనివారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ చేయకపోయినప్పటికీ 28 బంతుల్లో 37 పరుగులు బాదాడు. చూడ ముచ్చటమైన సిక్సర్లు బాదిన విరాట్ టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డును సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.
టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో మొత్తం 3000 పరుగుల మైలురాయిని చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఈ మైలురాయిని అందుకోవడానికి అందుకోవడానికి విరాట్‌కి 35 పరుగులు అవసరమవగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో సాధించాడు.
టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగుల ఆటగాళ్లు..
1. విరాట్ కోహ్లీ - 3,000 పరుగులు
2. రోహిత్ శర్మ - 2,637 పరుగులు
3. డేవిడ్ వార్నర్ - 2,502 పరుగులు
4. సచిన్ టెండూల్కర్ - 2,278 పరుగులు
5. కుమార్ సంగక్కర - 2,193 పరుగులు
కాగా బంగ్లాపై మ్యాచ్‌లో తాంజిమ్ హసన్ సాకిబ్ బౌలింగ్‌లో విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సాధించిన 37 పరుగులే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోర్‌గా ఉంది. అంతకుముందు నాలుగు మ్యాచ్‌లు ఆడగా 1, 4, 0, 24 చొప్పున పేలవమైన స్కోర్లు చేశాడు. విరాట్ ఫేయిల్ అవుతుండడంతో యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోవాలని, అవసరమైతే కోహ్లీని 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.