Share News

Pune Car Accident Case: యాక్సిడెంట్ కేసులో నిందితుడి తల్లి అరెస్టు..కారణమిదే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:42 AM

పూణే(pune) పోర్షే కారు(Porsche car) ప్రమాదం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. నిందితుడి మైనర్ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మైనర్ నిందితుడి తల్లి శివాని అగర్వాల్ తన బ్లడ్ శాంపిల్ ఇచ్చి తన కుమారుడి బ్లడ్ శాంపిల్ మార్చేందుకు వైద్యులకు డబ్బులు చెల్లించిందని పోలీసులు పేర్కొన్నారు.

Pune Car Accident  Case:  యాక్సిడెంట్ కేసులో నిందితుడి తల్లి అరెస్టు..కారణమిదే..
Pune Porsche car accident accused mother arrest

పూణే(pune) పోర్షే కారు(Porsche car) ప్రమాదం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. నిందితుడి మైనర్ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మైనర్ నిందితుడి తల్లి శివాని అగర్వాల్ తన బ్లడ్ శాంపిల్ తన కుమారుడికి ఇచ్చి బ్లడ్ శాంపిల్ మార్చేందుకు వైద్యులకు డబ్బులు చెల్లించిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ మేరకు పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. బ్లడ్ శాంపిల్(blood sample) మార్చిన కేసు బట్టబయలు కావడంతో శివాని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి ముంబై నుంచి పూణెకు రాగానే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.


ఈరోజు క్రైమ్ బ్రాంచ్ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుడి తల్లి సహా 11 మందిని అరెస్టు(Arrest) చేశారు. మైనర్ తండ్రిని మే 21న, తాతను మే 25న అరెస్టు చేశారు. ఇది కాకుండా అరెస్టైన వారిలో ససూన్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, ఒక సిబ్బంది, పబ్ యజమాని, మేనేజర్, సిబ్బందితో సహా 8 మంది ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం నిందితుడి తల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమారుడికి రక్షణ కల్పించాలని పోలీసులను(police) కోరింది. మద్యం సేవిస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియో తన కుమారుడిది కాదని నిందితుడి తల్లి వీడియోలో పేర్కొంది. తన కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు అలా చేసినట్లు తెలుస్తోంది.


మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో మైనర్ బాలుడు పోర్షే కారుతో ఐటీ రంగంలో పని చేస్తున్న యువకుడు, బాలికను ఢీకొట్టాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి అతి వేగంతో కారు నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్‌ను జూన్ 5 వరకు జువైనల్ హోమ్‌కు పంపించింది. శుక్రవారం (మే 31) అతన్ని విచారించడానికి జువైనల్ బోర్డు పోలీసులకు(police) అనుమతి ఇచ్చింది.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 12:12 PM