Share News

Secunderabad: బంధువులు.. కలిసికట్టుగా దొంగతనాలు

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:23 AM

రైళ్లలో చోరీలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 131 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావీద్‌ వివరాలు వెల్లడించారు.

Secunderabad: బంధువులు.. కలిసికట్టుగా దొంగతనాలు

- రైళ్లలో చోరీలు చేస్తున్న నలుగురి అరెస్ట్‌..

-131 గ్రాముల బంగారు నగలు స్వాధీనం

సికింద్రాబాద్‌: రైళ్లలో చోరీలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 131 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావీద్‌ వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడకు చెందిన ఓర్సు వెంకన్న(38), ఓర్సు నవీన్‌(25), ఓర్సు అశోక్‌(30) బంధువులు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మేడ్చల్‌ వరకు మెట్రో రైలు కావాలి


జల్సాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసలయ్యారు. రాత్రయితే మద్యం తాగి డబ్బు కోసం రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళల మెడలో బంగారు నగలను తెంపుకొని పారిపోతుంటారు. ఈ క్రమంలో చార్మినార్‌(Charminar) ప్రాంతానికి చెందిన సల్మాన్‌ మహ్మద్‌(29) ముగ్గురితో కలిసి నేరాలకు పాల్పడుతున్నారు.

city6.jpg


ఫిర్యాదులు రావడంతో రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో చోరీలు చేసేవారమని అంగీకరించారు. నిందితులపై సికింద్రాబాద్‌, నల్లగొండ రైల్వే పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో కేసులున్నాయని డీసీపీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 10:23 AM