Raksha Bandhan 2024: ఈ మంత్రం జపిస్తూ రాఖీ కడితే అంతా శుభప్రదమే..!
ABN , Publish Date - Aug 16 , 2024 | 06:15 PM
Raksha Bandhan 2024: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈ సారి రక్షాబంధన్ 19 ఆగష్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా.. శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది.
Raksha Bandhan 2024: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈ సారి రక్షాబంధన్ 19 ఆగష్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా.. శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం సోదరులపై ఉంటుందని విశ్వాసం. అయితే, రాఖీ కట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. మంత్రం పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. రక్షాబంధన్ రోజున సోదరి.. తన సోదరులకు ఏ మంత్రం చదువుతూ రాఖీ కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రక్షాబంధన్ నాడు ఏ మంత్రంతో రాఖీ కట్టాలి..
హిందూ మతంలో వేద మంత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మంత్రోచ్ఛరణ లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణమవదు. రక్షాబంధన్ రోజున కూడా అక్కాచెల్లెల్లు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కడుతూ మంత్రం చదవాలని పండితులు చెబుతున్నారు. రక్షాబంధన్ రోజున సోదరులకు కుంకుమ తిలకం పెట్టి.. రాఖీ కట్టేటప్పుడు అతని ముఖం తూర్పు వైపు.. సోదరి ముఖం పడమర వైపు ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితాలు శుభప్రదంగా ఉంటాయి. అన్ని రంగాల్లో పురోగతిని, విజయాన్ని సాధిస్తారు.
రాఖీ కడుతూ ఈ మంత్రాన్ని చదవాలి..
‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’’
అర్థం: ‘అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది.’
రాఖీ ఎలా ఉండాలి?
రాఖీ మూడు దారాలతో ఉండాలి.
రాఖీకి ఎరుపు-పసుపు రంగు దారం ఉండాలి
రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏం చేయాలి?
జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత.. దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి. లేదా పారే నీటిలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు.