Share News

CSIR UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 దరఖాస్తుకు నేడే లాస్ట్ తేదీ..అప్లై చేశారా..

ABN , Publish Date - May 27 , 2024 | 10:44 AM

మీరు CSIR యూజీసీ నెట్(CSIR UGC NET June 2024) కోసం అప్లై చేయాలని చూస్తున్నారా. అయితే వెంటనే ఈరోజు దరఖాస్తు చేయండి. ఎందుకంటే దీని కోసం అప్లై చేసేందుకు నేడే చివరి తేదీ. అయితే ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసేందుకు ఫీజు ఎంత, పరీక్ష ఎప్పుడుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

CSIR UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 దరఖాస్తుకు నేడే లాస్ట్ తేదీ..అప్లై చేశారా..
CSIR UGC NET June 2024 application date

మీరు CSIR యూజీసీ నెట్(CSIR UGC NET June 2024) కోసం అప్లై చేయాలని చూస్తున్నారా. అయితే వెంటనే ఈరోజు దరఖాస్తు చేయండి. ఎందుకంటే దీని కోసం అప్లై చేసేందుకు నేడే చివరి తేదీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CSIR UGC NET పరీక్షకు(exam) దరఖాస్తు చేయడానికి మే 27, 2024న రాత్రి 11.30 గంటల వరకు సమయం ఉంది. మీరు కొన్ని కారణాల వల్ల ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోతే ఈరోజు వెంటనే అప్లై చేయండి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఇప్పటికే పొడిగించినందున ఈరోజు తర్వాత మళ్లీ దరఖాస్తు తేదీ పెంచే అవకాశం లేదని చెప్పవచ్చు.


ఇలా అప్లై చేయండి

CSIR UGC NET పరీక్ష కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. దీని కోసం మీరు csirnet.nta.ac.in వెబ్‌సైట్ సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు మాత్రమే కాదు, పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, తదుపరి అప్ డేట్లను కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 25, 26, 27 తేదీలలో నిర్వహించబడుతుంది.

ఇక అప్లికేషన్‌లో ఏదైనా తప్పులు ఉంటే మార్పు చేసుకునేందుకు మే 29 నుంచి 31 మే వరకు అవకాశం ఇవ్వనున్నారు. CSIR UGC NET పరీక్షకు దరఖాస్తు చేయడానికి, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1150 చెల్లించాలి. EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు రూ. 600. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు రూ. 325 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


తప్పు సమాధానానికి

ఈ పరీక్ష మొత్తం 180 నిమిషాలు ఉంటుంది. రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. రెండు పేపర్లలో 150 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో నిర్వహించబడుతుంది. సరైన సమాధానానికి +2 మార్కులు ఇవ్వబడతాయి.

తప్పు సమాధానానికి 0.25 మార్కులు తీసివేయబడతాయి. దేశవ్యాప్తంగా 225 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ ద్వారా అర్హులైన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటే JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రోగ్రామ్‌లకు ఎంపిక చేయబడతారు. ఇది జాతీయ స్థాయి పరీక్ష, ఇది సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడుతుంది.


ఇవి కూడా చదవండి..

Arvind Kejriwal: మధ్యంతర బెయిల్‌ మరో 7 రోజులు పొడిగించండి

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

For More Education News and Telugu News..

Updated Date - May 27 , 2024 | 10:47 AM