Share News

CTET 2024 జూలై నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే

ABN , Publish Date - Mar 08 , 2024 | 06:33 AM

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET 2024) జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ముఖ్యమైన తేదీలు, అర్హత సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

CTET 2024 జూలై నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET 2024) జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ ఎగ్జామ్ జూలై 7, 2024న నిర్వహించబడుతుంది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడు వంటి వివరాలను ఇక్కడ చుద్దాం. ఈ పరీక్ష కోసం హాజరు కావాలనుకునే అభ్యర్థులు CBSE CTET అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inని క్లిక్ చేసి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు. మార్చి 7 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 2, 2024గా ప్రకటించారు.

ఈసారి CTET పరీక్ష దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. మొదటి పరీక్ష(Exam) జూలై నెలలో, రెండో పరీక్ష డిసెంబర్‌లో నిర్వహిస్తారు. CTET పేపర్-1లో విజయం సాధించిన అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణించబడతారు. కాగా పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల కోసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


CTET గురించి ఈ విషయాలు తెలుసా?

  • CTET సర్టిఫికేట్ చెల్లుబాటు జీవితాంతం ఉంటుంది

  • ఈ అభ్యర్థుల అడ్మిట్ కార్డులు పరీక్షకు రెండు రోజుల ముందు జారీ చేస్తారు. CTET ఫలితాలు ఆగస్టు చివరిలో ప్రకటిస్తారు

  • దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12, 2024 మధ్య సరిచేసుకోవచ్చు

CTET పేపర్-1 దరఖాస్తు కోసం అర్హత ఏమిటి?

- 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా.

లేదా

50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, 4 సంవత్సరాల B.EI.Ed.

లేదా

50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, విద్యలో రెండేళ్ల డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్)

CTET పేపర్-2 దరఖాస్తు కోసం అర్హత ఏమిటి?

ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా

లేదా

గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో, B.Ed

లేదా

50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, 4 సంవత్సరాల B.EI.Ed.

లేదా

50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత, 4 సంవత్సరాల B.A/B.Sc.Ed లేదా B.A.Ed/B.Sc.Ed.

లేదా

50% మార్కులతో గ్రాడ్యుయేషన్, B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్)

దరఖాస్తు రుసుము

జనరల్, OBC

పేపర్-1 లేదా పేపర్-2కి రూ.1000

రెండు పేపర్లకు - రూ. 1200

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు

పేపర్-1 లేదా పేపర్-2 కోసం రూ. 500

రెండు పేపర్లకు - రూ. 600

పరీక్షా షెడ్యూల్

సీటీఈటీ పేపర్-2 జూలై 7న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది.

సీటీఈటీ పేపర్-1 జూలై 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: School Holidays: వరసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవు.. ఏ రోజు నుంచి అంటే..?

Updated Date - Mar 08 , 2024 | 04:39 PM