Share News

CTET: సీటెట్ 2024 రిజల్ట్స్ విడుదల..ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:48 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈరోజు CTET పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఆ వివరాలేంటి, ఎలా తనిఖీ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

CTET: సీటెట్ 2024 రిజల్ట్స్ విడుదల..ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈరోజు CTET 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. CTET ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు CTET వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థుల మార్క్‌షీట్‌లు, అర్హత సర్టిఫికెట్‌లు మరికొన్ని రోజుల్లో డిజిలాకర్‌కు అప్‌లోడ్ చేయబడతాయి. CBSE జనవరి 21, 2024న CTET పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 84 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. CTET సర్టిఫికేట్ ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.


మీ ఫలితాల తనిఖీ కోసం అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inని క్లిక్ చేయండి. ఆ తర్వాత హోమ్ పేజీలోని ‘CTET జనవరి 2024 ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఫలితం మీ ముందు ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.

CBSE బోర్డు 18వ ఎడిషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET జనవరి 2024)ని జనవరి 21న దేశవ్యాప్తంగా 135 నగరాల్లోని 3,418 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది. ఈ ఏడాది రెండు పేపర్లకు కలిపి మొత్తం 26,93526 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ లేదా పేపర్ II ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడింది. రెండవ షిఫ్ట్ లేదా పేపర్ I, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు.

Updated Date - Feb 15 , 2024 | 07:48 PM