CUET 2025: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. వచ్చే ఏడాది సిలబస్ మార్పు
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:02 PM
వచ్చే ఏడాది నుంచి సీయూఈటీ-యూజీ, పీజీల్లో అనేక మార్పులు రానున్నాయని యూజీసీ చైర్మన్ జగదేష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో సిలబస్ కూడా మారుతుందని అన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో వచ్చే ఏడాది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. ఎందుకంటే యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2025 నిర్వహణ కోసం కొన్ని మార్పులను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే CUET UG, PG నిర్వహణను సమీక్షించడానికి కమిషన్ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. గత సంవత్సరాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా CUET విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించడానికి పరీక్ష ప్రక్రియను మెరుగుపరచడం అవసరమని UGC చీఫ్ అన్నారు. అందుకోసం సిలబస్ విధానాన్ని మార్చనున్నట్లు తెలిపారు.
సిలబస్‌లో మార్పులు
ఈ క్రమంలో నిపుణుల బృందం సమీక్ష తర్వాత 2025 ఎడిషన్‌లో అనేక మార్పులకు లోనవుతుందని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలు సంస్థల నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. నిపుణుల ప్యానెల్ సమీక్షించిన తర్వాత 2025లో సిలబస్‌లో మార్పులు చేయబడతాయి. కమిటీ పరీక్ష నిర్మాణం, పేపర్ల సంఖ్య, పరీక్ష పేపర్ల వ్యవధి, సిలబస్, కార్యాచరణ వంటి వివిధ అంశాలను ఇప్పటికే పరిశీలించినట్లు తెలిపారు. కమిషన్ ఇటీవలి సమావేశంలో ఈ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుందని అన్నారాయన.
హైబ్రిడ్ మోడ్‌లో
ఈ క్రమంలో CUET-UG, CUET-PG 2025 నిర్వహణకు సవరించిన మార్గదర్శకాలను వివరించే ముసాయిదా ప్రతిపాదనను కమిషన్ త్వరలో విడుదల చేస్తుందని UGC చీఫ్ తెలియజేశారు. 2022లో జరిగిన మొదటి ఎడిషన్ పరీక్షలో CUET-UG సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడింది. దీంతోపాటు ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలు బహుళ షిఫ్ట్‌లలో నిర్వహించబడుతున్నందున, ఫలితాల ప్రకటన సమయంలో స్కోర్‌లను సాధారణీకరించవలసి ఉంటుంది. పరీక్ష 2024లో మొదటిసారిగా హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించబడింది. ఆ క్రమంలో పలు కారణాల నేపథ్యంలో ఇది నిర్వహించబడటానికి ఒక రాత్రి ముందు ఢిల్లీ అంతటా రద్దు చేయబడింది.
గతంలో జరిగిన తప్పులు..
అయితే ఈ మార్పులను త్వరగా ప్రకటిస్తే విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా సిలబస్ మార్పుల విధానాన్ని ప్రకటిస్తే వచ్చే ఏడాది జరగనున్న CUET-UG, CUET-PG 2025 విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. దీంతోపాటు గత ఏడాది జరిగిన తప్పులను ఈసారి జరగకుండా విద్యార్థులకు ఆటంకం లేకుండా అనుకూలమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Next Week IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఏకంగా 11 ఐపీఓలు..
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Education News and Latest Telugu News